Vemana Padyalu |

#Vemana Padyalu
#Motivational Messages
#Life Truth Quotes
#Inspirational Messages
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలా
వేమన పద్యములు - తాత్పర్యము : Part 1️⃣9️⃣
🌿🌸🌿🌸🌿🌿🌸🌿🌸🌿
💥 మనల్ని ప్రగతి పథంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే వేమన పద్యాలను తాత్పర్యముతో సహా రోజుకీ 3 పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం.
🙏 వేమన పద్యాలు--- 52
🌿🌸🌿🌸🌿
అక్షయాత్మకంబు నర్థింప గురిగని
నిశ్చయంబుగాను నిలిపి మనసు
రక్ష గట్టినట్లు రట్టడి మాన్చరా
విశ్వదాభిరామ వినుర వేమా !
💥 తాత్పర్యము ---
🌿🌸🌿
మనసు నిబ్బరము చేసుకుని , చక్కని లక్ష్యముతో ముందుకు సాగువాడే వివేకిగా చెప్పబడును.
🙏 వేమన పద్యాలు --- 53
🌿🌸🌿🌸🌿
అక్షరంబు జదివి యందున గనలేక
హెచ్చు తక్కువనుచు యేపుమీరి
యక్షరాత్ముడన్న యతనికి ఫలమేమి
నిశ్చయంబు దెలుపు నీవు వేమా.
💥 తాత్పర్యము ---
🌿🌸🌿
ఎన్ని అక్షరాలు చదివినా , ఎంత పండితుడైనా దైవమును చూడలేనివాడు అక్షరాత్ముడు కాలేడని తెలియవలెను.
🙏 వేమన పద్యాలు --- 54
🌿🌸🌿🌸🌿
అక్షరంబెరుగని యాచార మదియేల
తాను దినని యట్టి ధన మదేల
నొరుల మేలుజూచి యోర్వని తనువేల
విశ్వదాభిరామ వినుర వేమా !
💥 తాత్పర్యము ---
🌿🌸🌿
చదువు అన్నిటికిని ఆచార సాంప్రదాయములకును మూలము.
ఆ చదువే లేనిచో ఇక ఆచారమేమిటి ?
సాంప్రదాయమేమిటి ?
ధనవంతుడైన తాను తిని , ఇతరులకింత పెట్టవలెను.
కుదువబెట్టిన , నేలపాలో , దొంగపాలోయగును.
మనిషన్న తరువాత ఇతరులకు ఉపయోగపడాలి.
ఉపకారం చేయాలి.
ఇతరుల బాగోగులు చూసి ఈర్షపడువాడు నిరర్ధకుడుగా నుండును.
పార్వతీపరమేశ్వరుల దివ్య ఆశీస్సులు అందరిపై ఉండాలని మనసారా కోరుకుంటూ మిత్రులందరికీ శుభోదయం 🌷🌷🌷
--- ప్రేమతో మీ కుముదిని దేవి
సర్వేజనా సుఖినోభవంతు 🙏🙏🙏
శివార్పణమ్ 🕉️🙏🕉️

Пікірлер: 3

  • @KumudiniDeviGopireddy-hp1xn
    @KumudiniDeviGopireddy-hp1xn12 күн бұрын

    అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలా వేమన పద్యములు - తాత్పర్యము : Part 1️⃣9️⃣ 🌿🌸🌿🌸🌿🌿🌸🌿🌸🌿 💥 మనల్ని ప్రగతి పథంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే వేమన పద్యాలను తాత్పర్యముతో సహా రోజుకీ 3 పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం. 🙏 వేమన పద్యాలు--- 52 🌿🌸🌿🌸🌿 అక్షయాత్మకంబు నర్థింప గురిగని నిశ్చయంబుగాను నిలిపి మనసు రక్ష గట్టినట్లు రట్టడి మాన్చరా విశ్వదాభిరామ వినుర వేమా ! 💥 తాత్పర్యము --- 🌿🌸🌿 మనసు నిబ్బరము చేసుకుని , చక్కని లక్ష్యముతో ముందుకు సాగువాడే వివేకిగా చెప్పబడును. 🙏 వేమన పద్యాలు --- 53 🌿🌸🌿🌸🌿 అక్షరంబు జదివి యందున గనలేక హెచ్చు తక్కువనుచు యేపుమీరి యక్షరాత్ముడన్న యతనికి ఫలమేమి నిశ్చయంబు దెలుపు నీవు వేమా. 💥 తాత్పర్యము --- 🌿🌸🌿 ఎన్ని అక్షరాలు చదివినా , ఎంత పండితుడైనా దైవమును చూడలేనివాడు అక్షరాత్ముడు కాలేడని తెలియవలెను. 🙏 వేమన పద్యాలు --- 54 🌿🌸🌿🌸🌿 అక్షరంబెరుగని యాచార మదియేల తాను దినని యట్టి ధన మదేల నొరుల మేలుజూచి యోర్వని తనువేల విశ్వదాభిరామ వినుర వేమా ! 💥 తాత్పర్యము --- 🌿🌸🌿 చదువు అన్నిటికిని ఆచార సాంప్రదాయములకును మూలము. ఆ చదువే లేనిచో ఇక ఆచారమేమిటి ? సాంప్రదాయమేమిటి ? ధనవంతుడైన తాను తిని , ఇతరులకింత పెట్టవలెను. కుదువబెట్టిన , నేలపాలో , దొంగపాలోయగును. మనిషన్న తరువాత ఇతరులకు ఉపయోగపడాలి. ఉపకారం చేయాలి. ఇతరుల బాగోగులు చూసి ఈర్షపడువాడు నిరర్ధకుడుగా నుండును. పార్వతీపరమేశ్వరుల దివ్య ఆశీస్సులు అందరిపై ఉండాలని మనసారా కోరుకుంటూ మిత్రులందరికీ శుభోదయం 🌷🌷🌷 --- ప్రేమతో మీ కుముదిని దేవి సర్వేజనా సుఖినోభవంతు 🙏🙏🙏 శివార్పణమ్ 🕉️🙏🕉️

  • @bsbmmsriganesha8824

    @bsbmmsriganesha8824

    9 күн бұрын

    శ్రీరామ❤🙏

  • @KumudiniDeviGopireddy-hp1xn

    @KumudiniDeviGopireddy-hp1xn

    9 күн бұрын

    @@bsbmmsriganesha8824 ధన్యవాదములు గణేశ 🌷🙌🙏

Келесі