#Vemana

#Vemana Padyalu
#Motivational Messages
#Life Truth Quotes
#Inspirational Messages
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలా
వేమన పద్యములు - తాత్పర్యము : Part 3️⃣1️⃣
🌿🌸🌿🌸🌿🌿🌸🌿🌸🌿
💥 మనల్ని ప్రగతి పథంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యముతో సహా రోజుకీ 3 పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం.
🙏 వేమన పద్యాలు--- 88
🌿🌸🌿🌸🌿
అజుడీ లోకము ల్లెలను
సృజియించెను గజభుజంగ స్థిరచర జీవుల్
నిజరూప భావ మొందక
గజిబిజియై పుట్టుజచ్చు గదరా వేమా !
💥 తాత్పర్యము ---
🌿🌸🌿
బ్రహ్మ ఈ లోకాలన్నిట ఏనుగులను , పాములను , సమస్త జీవరాశులను సృజించినాడు.
అవి తమ తమ నిజతత్వమును తెలిసికొనలేక జనన మరణములను పొందుచుండును.
🙏 వేమన పద్యాలు --- 89
🌿🌸🌿🌸🌿
అజ్ఞానమనెడి యడవిని
సుజ్ఞానపు ఖడ్గమునను జూచి నరకరా
యజ్ఞాన మాత్మ దెలుపుట
సుజ్ఞానపు దివ్యపదము జూడర వేమా !
💥 తాత్పర్యము ---
🌿🌸🌿
అజ్ఞానమనే అడవిని , మంచి జ్ఞానమనెడి కత్తితో ఛేదించవలెను.
అజ్ఞానము లేకుండ జ్ఞానియైన వాడు మోక్ష మార్గమును కాంచగలడు.
🙏 వేమన పద్యాలు --- 90
🌿🌸🌿🌸🌿
అజ్ఞానమే శూద్రత్వము
సుజ్ఞానము బ్రహ్మమౌట శ్రుతులను వినరా
యజ్ఞాన ముడిగి వాల్మీకి
సుజ్ఞానపు బ్రహ్మమొందె జూడర వేమా !
💥 తాత్పర్యము ---
🌿🌸🌿
అజ్ఞానమే చెడ్డది.
జ్ఞానము బ్రహ్మ , శాస్త్రాలు విని , చెడును వీడి , ప్రవర్తించిన వాల్మీకి సుజ్ఞాన బ్రహ్మతత్వమును తెలిసినవాడయ్యెను.
పార్వతీపరమేశ్వరుల దివ్య ఆశీస్సులు అందరిపై ఉండాలని మనసారా కోరుకుంటూ మిత్రులందరికీ శుభోదయం 🌷🌷🌷
--- ప్రేమతో మీ కుముదిని దేవి
సర్వేజనా సుఖినోభవంతు 🙏🙏🙏
శివార్పణమ్ 🕉️🙏🕉️

Пікірлер: 1

  • @KumudiniDeviGopireddy-hp1xn
    @KumudiniDeviGopireddy-hp1xn22 күн бұрын

    అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలా వేమన పద్యములు - తాత్పర్యము : Part 3️⃣1️⃣ 🌿🌸🌿🌸🌿🌿🌸🌿🌸🌿 💥 మనల్ని ప్రగతి పథంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యముతో సహా రోజుకీ 3 పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం. 🙏 వేమన పద్యాలు--- 88 🌿🌸🌿🌸🌿 అజుడీ లోకము ల్లెలను సృజియించెను గజభుజంగ స్థిరచర జీవుల్ నిజరూప భావ మొందక గజిబిజియై పుట్టుజచ్చు గదరా వేమా ! 💥 తాత్పర్యము --- 🌿🌸🌿 బ్రహ్మ ఈ లోకాలన్నిట ఏనుగులను , పాములను , సమస్త జీవరాశులను సృజించినాడు. అవి తమ తమ నిజతత్వమును తెలిసికొనలేక జనన మరణములను పొందుచుండును. 🙏 వేమన పద్యాలు --- 89 🌿🌸🌿🌸🌿 అజ్ఞానమనెడి యడవిని సుజ్ఞానపు ఖడ్గమునను జూచి నరకరా యజ్ఞాన మాత్మ దెలుపుట సుజ్ఞానపు దివ్యపదము జూడర వేమా ! 💥 తాత్పర్యము --- 🌿🌸🌿 అజ్ఞానమనే అడవిని , మంచి జ్ఞానమనెడి కత్తితో ఛేదించవలెను. అజ్ఞానము లేకుండ జ్ఞానియైన వాడు మోక్ష మార్గమును కాంచగలడు. 🙏 వేమన పద్యాలు --- 90 🌿🌸🌿🌸🌿 అజ్ఞానమే శూద్రత్వము సుజ్ఞానము బ్రహ్మమౌట శ్రుతులను వినరా యజ్ఞాన ముడిగి వాల్మీకి సుజ్ఞానపు బ్రహ్మమొందె జూడర వేమా ! 💥 తాత్పర్యము --- 🌿🌸🌿 అజ్ఞానమే చెడ్డది. జ్ఞానము బ్రహ్మ , శాస్త్రాలు విని , చెడును వీడి , ప్రవర్తించిన వాల్మీకి సుజ్ఞాన బ్రహ్మతత్వమును తెలిసినవాడయ్యెను. పార్వతీపరమేశ్వరుల దివ్య ఆశీస్సులు అందరిపై ఉండాలని మనసారా కోరుకుంటూ మిత్రులందరికీ శుభోదయం 🌷🌷🌷 --- ప్రేమతో మీ కుముదిని దేవి సర్వేజనా సుఖినోభవంతు 🙏🙏🙏 శివార్పణమ్ 🕉️🙏🕉️

Келесі