Naa Prapancham Short Film | LB Sriram Heart films | Bharath bandaru | Sai Srikanth | Tamada Media

Ойын-сауық

* Adhi Naadhi Idhee Naadhe Full Song : • Adhi Naadhi Idhee Naad... A delivery boy with dreams crushed by circumstances, meets a stranger - an elderly man who has witnessed life in all its seasons.
A chance encounter has our protagonist burdened with life, questioning his decisions.
Will this encounter change his life forever or will he choose a path that has no end?
Watch how an unexpected daily delivery intertwines the fate of the delivery boy and shape the story of a man who has almost given up on dreams...
Written, Edit & Directed:
Sai Srikanth Bandaru
Produced:
LB Sriram
Cast:
LB Sriram
Bharath Bandaru
Suchala Yasaswy
Cinematography:
Hari Krishna
Dialogues and Asst. Director:
Rajkumar G
Music:
Stanley Telagathoti
Music mixing and sound design:
Chandra Neeil
Poem writer:
Ram Manohar Kadimicharla
Stills and making video:
Rajesh K
Operative Cameraman:
Vidya Sagar
Publicity Designs:
Likith Mouli
Rishi
Sai Srikanth Bandaru
Subtitles:
Gayathri Chaganti
Follow Me Here :
Facebook: / lbsriram
Twitter: / lb_sriram
Website: lbsriram.com/
#LBSriram #NaaPrapancham #TamadaMedia #shortfilms #telugushortfilms

Пікірлер: 467

  • @lbsriram6916
    @lbsriram6916 Жыл бұрын

    5రోజుల్లో 100000 మంది ప్రేక్షకులు చూసిన-- 'ఒక్క వ్యక్తి యొక్క- మానసిక- సంఘర్షిత- ప్రపంచ' నేపథ్య విలక్షణ చిత్రాన్నీ , నేటి యువత అభిమతాన్నీ, సతమతాన్నీ, జీవిత సత్యాన్నీ-- ప్రయోగాత్మకంగా, ప్రబోధాత్మకంగా, మీదు మిక్కిలి ప్రతి కుటుంబంలోని అందరి సభ్యుల అభినందననీ అందుకునే చక్కటి కుటుంబ కథా చిత్రంగా తీర్చి దిద్దిన విధానాన్నీ, తన సాంకేతిక ప్రతిభనీ- ప్రతి ఫ్రేములో చాటుకుని, నిర్మించిన- 'నా-ప్రపంచం' అనే గొప్ప విజయవంతమైన చిత్రాన్ని నా హార్ట్ ఫిలింస్ భాండాగారంలో జమ చేసిన నవ యువ దర్శకుడు 'సాయి శ్రీకాంత్' కి అనేక మనః పూర్వక అభినందనలూ, ఆశీస్సులూ అందిస్తూ- అతని ఉజ్వల భవిష్యత్తుని శుభాకాంక్షిస్తున్నాను! ఒక మంచి ప్రయోగాన్ని విజయవంతం చేసి, నా నమ్మకాన్ని గెలిపించిన వీక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను _/\_

  • @lbsriram6916

    @lbsriram6916

    Жыл бұрын

    ఈ మొత్తం విజయంలో- నటీనటుల, సాంకేతిక నిపుణుల, మొత్తం Team సభ్యుల- భాస్వామ్యం పెద్ద మొత్తంలోనే ఉందన్న విషయం తెలుస్తూనే ఉంది! అందరికీ ప్రత్యేక అభినందనలు!

  • @thisissaisrikanth6671

    @thisissaisrikanth6671

    Жыл бұрын

    @@lbsriram6916 నన్ను నమ్మి నాకు, నా టీంకి ఒక అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్, ఎప్పటి మర్చిపోలేను మీతో కలిసి పనిచేసిన అనుభూతిని, సంపాదించుకున్న అనుభవాన్ని...

  • @Kamaniyamramaniyam

    @Kamaniyamramaniyam

    Жыл бұрын

    అభినందనలు సాయి శ్రీకాంత్

  • @hareshmrl8855

    @hareshmrl8855

    Жыл бұрын

    @@lbsriram6916 నిజమే సార్...

  • @jakkulamaheshyadav3101

    @jakkulamaheshyadav3101

    Жыл бұрын

    Goppa vallu sir🙏

  • @sivaanchula8364
    @sivaanchula8364 Жыл бұрын

    పాతికేళ్లకే పాతరై పోతున్న జీవితాలెన్నో, జీవితమనే పుస్తకంలో కాలిపోయిన కాగితాలెన్నో, మనవాళ్ళ ఆనందం కోసం మనసును సమాధి చేసుకుని సమాధానం దొరకని ప్రశ్నగా సాగుతున్న సందర్భాలెన్నో.

  • @srivenkateswarawholesalesarees

    @srivenkateswarawholesalesarees

    10 ай бұрын

    Excellent sir

  • @nagatag5767

    @nagatag5767

    9 ай бұрын

    Super

  • @naidumaheswararao4440

    @naidumaheswararao4440

    8 ай бұрын

    Supar sir❤

  • @vasa.saritha2826

    @vasa.saritha2826

    4 ай бұрын

    Very true sir

  • @madhubollimuntha3035

    @madhubollimuntha3035

    3 ай бұрын

    👍🏼

  • @satya3636
    @satya36363 ай бұрын

    కడుపులో కళని దాచుకొని, చదివిన చదువుని పట్టాల్లో కట్టిపెట్టి, కుటుంబం కోసం కూలీలా మారిన ప్రతి అబ్బాయి కథే......ఈ కథ✍️🚶💔

  • @madhukar_writings
    @madhukar_writings Жыл бұрын

    కన్నీళ్లు నీ భాధకి చిరునామ అయితే సంతోషం నీ విజయానికి చిరునామ. బంధాలకి, బంధుత్వాలకి.. జీతానికి, జీవితానికి, జీవానికి మధ్యలో పడే జీవన అంతర్మదనం... బ్రతికున్నప్పుడే కాదు చచ్చాక కూడా స్వేచ్ఛ దొరకదు Super short film from you L.B SRI RAM GARU ఒక్క కవిత్వం ఈ చిత్రాన్ని బ్రతికిస్తుంది...

  • @varunkumarayyapu7649
    @varunkumarayyapu7649 Жыл бұрын

    అద్భుతమైన లఘు చిత్రం గురువు గారు ఈ జీవిత బంధాల మధ్యలో పరిస్థితుల ప్రభావం వలన కల ఎపుడు ఓడిపోతునే ఉంటుంది గురువు గారు.

  • @rajasekharmodugumudi8710
    @rajasekharmodugumudi8710 Жыл бұрын

    Excellent sir . కుర్రాడు కూడా ఇరగ దీసాడు... మీకు ప్రశంస కూడా తక్కువే...మాటలకందని భావం..మీ నటన..

  • @muneendrayerrabathina4793
    @muneendrayerrabathina4793 Жыл бұрын

    గుడ్ ఈవినింగ్ గురువుగారూ....🙏🙏🙏🙏 బంధాల పంజరంలో చిక్కిన బాధ్యతల రెక్కలు కట్టిన పక్షి కి ఆ పంజరమే కదా ప్రపంచం... వాస్తవాన్ని చూపించారు...చాలా బాగుంది...💐💐💐💐💐💐💐💐💐👏👏👏👏👏

  • @nayakalluprashanth308
    @nayakalluprashanth308 Жыл бұрын

    నేను మధ్యలో వదిలేసిన పుస్తకం మళ్ళీ నాకు గుర్తు చేశారు...ఇప్పుడు అది పూర్తిగా చదువుతా,, అదే చివరకు మిగిలేది...మీకు కృతజ్ఞతలు. కథలో చాలా balanced గా మన కల త్యాగం ...మన వాళ్ల క్షేమం చూపించారు... మీ అనుభవాలు నాకు చాలా కావాలి...

  • @sahasratv4268
    @sahasratv4268 Жыл бұрын

    అయ్యా..... రచయిత అవటానికి సర్వం కోల్పొయి ..నాలో..నేను కూడా లేకుండా ..చాలా సార్లు నేను బికారిగా మారాను.నా నీడ కూడ నా మీద అసహ్యంతో నన్ను వదిలి వెళ్ళిపోయింది . నేను కొన్ని వేల సార్లు మరణించాను .కొన్ని వేల సార్లు బ్రతికాను.. . మీకుతెలీదు . నేను నడుస్తున్న అగ్నిగుండాన్ని. నడూస్తున్న వామన పాదాన్ని. నడుస్తున్న ఆరని స్మశానజ్వాలని రచయిత ..అంటే మండుతున్న రావణకాష్టం రచయిత అంటే తనను తాను కాల్చుకోని ..ఆ మంటల్లో వేలిగే నెలవంక రచయిత అంటే తనను తాను బూడిదను చేసుకోని .. ఆ బూడిదలోంచి..మొలిచే కొత్త పొద్దు.. ప్రపంచం లో ఉన్న అన్ని వ్రుత్తుల్లోకెల్లా అతికష్టమైన పని రచయిత అవటం ........ప్రకాష్

  • @MandapatiSatyam
    @MandapatiSatyam Жыл бұрын

    ఇది ఒక లఘు చిత్రం కాదు, ఆకాశమంత పెద్ద చిత్రం. మీ అందరికి అభినందనలు.

  • @venkatreddy7135
    @venkatreddy71354 ай бұрын

    కళ కి త్యాగాన్ని జోడించి ముగించారు Lb sriram gaari సీన్ సూపర్ గా ఉంది కళాకారులు తన కళ కోసం జీవితాన్ని త్యాగం చేశారు తనలో ఉన్న ఏ కళ అయినా తనని అవకాశం కోసం వెతకమని నిరంతరం చెప్తూనే ఉంటుంది తన వాళ్ళ కోసం కళను త్యాగం చెయ్యటం బాలేదు

  • @satyapriya9493
    @satyapriya9493 Жыл бұрын

    మంచి రచన ఇప్పుడసలు ఈతెలుగే అర్థంకాదెవరికీ...అభినందనలు,ధన్యవాదాలు...సత్యప్రియాదేవ్🙏🙏👌👌👌👌

  • @sureshvarma6990
    @sureshvarma6990 Жыл бұрын

    ఎల్. బి.గారు మరోసారి మా ‌హృదయాన్నీ హత్తుకునే హర్ట్ ఫిలిం అందించినందుకు ధన్యవాదాలు. మీ హర్ట్ ఫిలింస్ చూడడం , కొత్త హర్ట్ ఫిలిం ఎప్పుడు వస్తుంది అని ఎదురు చూడడం ఒక మంచి వ్యసనం లా తయారయింది నాకు.

  • @Koushikeducationhub
    @Koushikeducationhub Жыл бұрын

    ప్రతి అర్థం, ప్రతి మాట, ప్రతి భావం ఎప్పుడు అయితే ఎదుట వాడికి అర్థం అవుతుందో అదే మన విజయం.. 💥💥❤❤

  • @maddilasaideepika8507

    @maddilasaideepika8507

    Жыл бұрын

    Yes

  • @tsrvenkat
    @tsrvenkat Жыл бұрын

    మనలోని కళ వృత్తి గా ఎదగక పోయినా మన ప్రవృత్తి గా మనలో మనతో ఉంటుందనుకుంటా. బాగుంది అండీ ఫిల్మ్.

  • @AnilAnil-fb9dh
    @AnilAnil-fb9dh Жыл бұрын

    జీవిత చక్రం ఆవిష్కరించారు.....అద్భుతం సార్

  • @vanjaneyulu8767
    @vanjaneyulu8767 Жыл бұрын

    ఈ చిత్రంలో ప్రధానంగా పోషించిన రెండు పాత్రలు తమ యొక్క వాదన కరెక్ట్ గానే వినిపించాయి అని అనిపిస్తూ ఉంది చాలా మంచి చిత్రాన్ని మాకు అందించినందుకు దర్శక నిర్మాతలకు నటీనటులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు

  • @operation50-oldisgold6
    @operation50-oldisgold6 Жыл бұрын

    ఎన్ని మనసులో అన్ని ప్రపంచాలు..ఎవరెవరి ప్రపంచం వారిదైనా అందరూ బ్రతికేది నూరేళ్ళే కదా.! కాబట్టి... ఆశ్రమ ధర్మాలననుసరించి బాల్యంలో బ్రహ్మచర్య ధర్మాన్ని, యవ్వనంలో గృహస్థు ధర్మాన్ని, నడి వయసు నుండి వాన ప్రస్థ ధర్మాన్ని,వృద్ధాప్యంలో సన్యాస ధర్మాన్ని స్వీకరించడం సర్వదా శ్రేయస్కరం.! 🙏🙏🙏

  • @yaswanthsuvvari5948
    @yaswanthsuvvari5948 Жыл бұрын

    ప్రతి మనిషికి ఆశలు ఉంటాయ్ ఆశయాలు ఉంటాయ్.. కానీ అందరికీ ఆస్తులు ఉండవ్.. అవసరాలు ఆగవ్.. బాధ్యతలు వదలవ్.. బంధాలు విడవవ్.. వీటికి కొంతమంది తలవంచక తప్పదు.అలా అని తలవంచని వారులేకపోలేదు వారెవరో మనకు తెలుసు.. ఇక తలదించలా...తలవంచలా నిర్ణయం మనదే.

  • @rambabumuddada8467

    @rambabumuddada8467

    Жыл бұрын

    Nuvvu cheppedi nijam bro...kakapote talavanchakunda success ayinavaaru padullo unte,failure ayinavaallu velallo unnaru...aa bhayame talavachela chestundi.

  • @lakshmiraokokkeragadda4152
    @lakshmiraokokkeragadda4152 Жыл бұрын

    చాలా బాగా రాశారు.. తీశారు .చేశారు.. కలం కన్నా కుటుంబమే గొప్పదని నిరూపించారు. కళ.. కల కాకుండా ఉండాలంటే..కాలం కలిసి రావాలి కానీ..బంధాలను విడిచి పెట్టకూడదన్న సత్యాన్ని ఆవిష్కరించారు.."నా ప్రపంచాన్ని.."మన" ప్రపంచం చేశారు...అభినందనలు..lb. శ్రీరామ్ గారూ..... కె.వి.లక్ష్మణరావు

  • @umaranipinnamaneni3202
    @umaranipinnamaneni3202 Жыл бұрын

    Very nice. మనిషికి తనకేం కావాలో ఆని తెలుసుకోవాలి ఈ జీవితం ముగిసేలోగా అనేది చాలా సింపుల్ గా మనసు హత్తుకునేలాగా చూపించారు. చాలా బాగుంది.

  • @srisimhacreations
    @srisimhacreations Жыл бұрын

    It's not short film, from now it's my Heart film. LB geri *ప్రతి మాట నా హృదయం నాతో మాట్లాడుతున్నట్టు ఉంది*

  • @krishnamoorthykadayinti6637
    @krishnamoorthykadayinti6637 Жыл бұрын

    అద్భుతం ఆర్యా. అద్దంలో చూసుకోవడానికి ధైర్యం ఉండాలి.నజం. కృష్ణ మూర్తి.

  • @rajudevalla9931
    @rajudevalla9931 Жыл бұрын

    నా ప్రపంచం ఒక అద్భుతం ఎల్బీ శ్రీరామ్ గారు చాలా బాగా చేశారు డైరెక్షన్ చాలా బాగుంది congrats 🌹🌹👍 శుభాకాంక్షలు

  • @visistadhayini4070
    @visistadhayini4070 Жыл бұрын

    చాలా బాగుంది... చాలా బాగా తీసారు, దర్శకత్వ విలువలు కనిపిస్తున్నాయి. కెమెరామెన్ కి నా అభినందనలు.

  • @memecediy-8442
    @memecediy-8442 Жыл бұрын

    ప్రతి పదం.. ప్రతి మాట.. ఎంతో అర్థం ఉంది... 99% ప్రతి మనిషి జీవితం లో జరిగే ఒక అంతర్మధనం 🙏🙏

  • @naveenank2213
    @naveenank2213 Жыл бұрын

    మంచి సందేశం అని చెప్పాలా... ఇదే ఎందరో జీవితల్లో (కల )ఉండి బయట కి వాలా ఆర్థిక పరిస్థుల వలన చెప్పలేక జీవిస్తున్న వ్యక్తులు ఎందరో ఉన్నారు సార్....మాటల రూపంలో జీవితాన్ని చూయించారు 😇🙏🏻💫

  • @baswarajmangali2594
    @baswarajmangali2594 Жыл бұрын

    మనలో కళ ఉన్నా దారిచుపించే వేళ్ల కన్నా వెక్కిరించే నోళ్లే ఎక్కువ!.... ఆశలు ఆకాశాన్ని అంటుతాయి, ఊహలు ఉవ్వెత్తున లేస్తాయి. కానీ, నిజం నిన్ను భూమ్మిదే ఉంచుతుంది. ధోని బ్యాట్ పట్టినపుడు, చిరంజీవి డ్యాన్స్ కట్టినపుడు, బాలు గాత్రం విన్నపుడు, బాపు చిత్రం కన్నపుడు, కళ కోసం కదిలిన కాళ్ళు ఎన్నో కల చేదిరి తడిసిన కళ్ళు ఎన్నో!

  • @madhukar_writings

    @madhukar_writings

    Жыл бұрын

    Last two lines awesome bro.. Keep it up

  • @baswarajmangali2594

    @baswarajmangali2594

    Жыл бұрын

    @@madhukar_writings tq bro 🙏

  • @dadivenkat4213

    @dadivenkat4213

    Жыл бұрын

    Excellent bro

  • @baswarajmangali2594

    @baswarajmangali2594

    Жыл бұрын

    @@dadivenkat4213 tq bro 🙏

  • @TheEagleRealty

    @TheEagleRealty

    Жыл бұрын

    Amazing words bro

  • @budagamvarun3633
    @budagamvarun3633 Жыл бұрын

    కృతజ్ఞతలు గురువు గారు మీ కు నా పాదాభివందనం. కళ మరియు జీవితం విలువలు అర్థం అయ్యేలా చెప్పారు.

  • @sreetejasravibillupati4708
    @sreetejasravibillupati4708 Жыл бұрын

    సినీ ఆకాశంలో (గగనంలో ) కష్టాల కళోలంలో ఊహల్లో ఎగిరే నా తోటి సినిమా మిత్రులకు చక్కని వివరణ...Sir.

  • @d.someswararao4824
    @d.someswararao4824 Жыл бұрын

    చాలా చాలా బాగుంది సార్ ఈ సినిమా చూస్తూంటే మీ పాత్రలో నన్ను చూసుకున్నట్లు అనిపించింది

  • @miss.unique1008
    @miss.unique1008 Жыл бұрын

    కథ.. కథనం... ఒక పాతిక ముప్పైయేళ్ళ కుర్రాడి ఆలోచనలు.. మానసిక సంఘర్షణలు చాలా బాగా చూపించారు...hearty congratulations to the entire team💐💐💐💐🎊🎈🎉🎈🎊

  • @rameshpilli9408
    @rameshpilli9408 Жыл бұрын

    కలం తో కదిలిన అక్షరాలు, కళ్ళతో చూసి, హృదయాన్ని తట్టిలేపేది కళ........ అది lb he'arts film.....

  • @teluguchannel2004
    @teluguchannel2004 Жыл бұрын

    ❤️❤️❤️❤️❤️... నిజం గా చాలా బాగుంది.... లాస్ట్ హీరో డెసిషన్ చాలా బాగుంది.... నా నిజ జీవితం లో నేను మారిపోయినట్లు గా బలే పెట్టారు 👌👌👌👌

  • @ramadevimovidi9962
    @ramadevimovidi9962 Жыл бұрын

    SRI RAM GARI HEART FILM. ... మానవజీవితానికి చాలా దగ్గరగా ఉంటాయి SRIRAM గారి ఈ కధ. ఎన్నో జీవితాలు ఇలాగే ముగిసిపోతాఇ . చాలా HEART TOUCHING STORY. CONGRATULATIONS.

  • @prashantharimella9234
    @prashantharimella9234 Жыл бұрын

    డాడీ....నా...ప్రపంచాన్ని... చాలా...సింపుల్ గా...చూపించారు... ఐనా...చాలా గొప్పగా చూపించారు... 💐💐💐💐💐 అందుకే... మిమ్మల్ని LB daddy అంటాను💐💐💐💐 Congratulations 💐💐💐daddy💐💐💐💐💐

  • @sumanthchava974

    @sumanthchava974

    Жыл бұрын

    Dialogues super and excellent direction. All the best for future ones.

  • @indragantisrinivas1879
    @indragantisrinivas1879 Жыл бұрын

    జీవిత చక్రం ఆవిష్కరించారు. మనిషి జీవితంలో సంఘర్షణ చాలా బాగుంది. మీ మనోవేదన ఎంత వాస్తవమో, అతని నిర్ణయం కూడా అంతే అవసరం. మమ్మల్ని మేము అద్దంలో చూసుకున్న ట్లు ఉంది. మీ ఇద్దరికీ అభినందనలు. 👌👌👏👏👏

  • @akrcreations8376
    @akrcreations8376 Жыл бұрын

    అద్భుతం గురూజీ... మంచి స్ఫూర్తినిచ్చే షార్ట్ ఫిల్మ్... మంచి మెసేజ్... 👌👌👌🙏🙏🙏👍👍👍

  • @lokeswarareddy6101
    @lokeswarareddy6101 Жыл бұрын

    రామ్ మనోహర్ కడిమిచర్ల .... మనోహరన్న...... Your Dialogues Are Very Poetic

  • @praveensanku4996
    @praveensanku4996 Жыл бұрын

    అక్షరం అనీ రాయాకా బ్రతుకు అనే బంధం లో నలుగు తున్నా ఓ మాటా ని అందంగా ఇప్పటి తరం నీకి అద్దములా చూపించారు ఈ అక్షరం చేరగాదు మీ ప్రవీణ్ ✍️

  • @a_s_bharadwaj
    @a_s_bharadwaj9 ай бұрын

    అంతా బాగానే ఉందిగాని మనశ్శాంతి కి తాగుడు అవసరం అని చెప్పడం ఒక నెగటివ్ మెసేజ్ ఇస్తోంది సమాజానికి. ఎన్నో హృదయానికి హత్తుకునే షార్ట్ ఫిలిమ్స్ తీసిన LB Sriram గారి నుండి ఇది ఊహించలేదు.

  • @madhurikella5415
    @madhurikella5415 Жыл бұрын

    Really superb short film sir అక్షరానికి జీవితానికి మధ్య జరిగిన అంత మధ్యమాన్ని అద్భుతంగా చూపించారు👍👏👏

  • @jassikalyanentertainmentvl8903
    @jassikalyanentertainmentvl8903 Жыл бұрын

    జనాన్ని నమ్మి మీరు ఈ కధ చెప్పలేదు sir నిజాన్ని నమ్మి తీశారు. 🙏🙏

  • @srinivasulu9054
    @srinivasulu9054 Жыл бұрын

    మనం ఒక్కొక్క స్టేజిలో ఒక్కొక్కరి కోసం బతుకుతాం,,జీవిత సత్యం

  • @nagabhushanamshankam6155
    @nagabhushanamshankam6155 Жыл бұрын

    మమ్మల్ని మేము చూసుకున్నట్టుంది సార్ కన్నీళ్లు వస్తున్నాయి ఏమో కలలు కంటూ కుటుంబం కోసం ఉద్యగం చేసుకుంటూ ఆ కలలో అన్నిటిని క ల్లలుచేసుకున్నా ఇంకా ఏదో ఆశ వెన్నడుతోంది

  • @rajeshyadhav1192
    @rajeshyadhav1192 Жыл бұрын

    చాలా మంచి స్టోరీ sir. నేనూ కూడా ఆ delivery boy లాగానే ఆలోచిస్తున్నను. నా వాళ్ళ కళ్ళలో ఆనందం చాలు, నా కష్టం, బాధ మర్చిపోవాడానికి .....🥺🥺🥺

  • @harishallarapu3553
    @harishallarapu3553 Жыл бұрын

    నా కథ నేను చూస్తున్నట్టు అనిపించింది... నేను రచయితని అవ్వాలి అనుకున్నాను... నేను పెళ్లి అయ్యి సంసారాన్ని ఈదు తున్నాను... ఏదో ఒక విషయానికి కట్టుబడి ఉండకపోతే... ఈ బ్రతుకు అనే ప్రయాణాన్ని చేయలేం... అందుకే బంధానికి కట్టుబడి ఉన్నాను... అలా అని కలాన్ని వదిలేయలేదు, వదిలేయలేను... చిన్న చిన్న ప్రయత్నాలు చేస్తూ అలా ముందుకి పోతూ నన్ను నేను కోల్పోకుండా బ్రతుకుతున్నాను... మీ లఘు చిత్రానికి నా పాదాభివందనం 🙏... ముఖ్యంగా గురువుగారి నటనకు🙇... #harish.wrigings on Instagram మిగిలిన అందరూ చాలా బాగా చేసారు... అన్ని డిపార్ట్మంట్స్ కూడా చాలా బాగా పని చేశారు....👏👏👏👏🙏

  • @gandhibabu7351
    @gandhibabu7351 Жыл бұрын

    అప్పటి కాలంలో అదీ నిజం ఇప్పటి కాలంలో. ఇది నిజం కాలానుగుణంగా మానవులు ప్రవర్తించాలి

  • @gowrabathininareshkumar5878
    @gowrabathininareshkumar5878 Жыл бұрын

    Nee adham ninu prasninchalamunde . Ninu nuvu yethuko... Great dialogue.. inspired me..

  • @sureshmoksha3328
    @sureshmoksha3328 Жыл бұрын

    పువ్వులా నవ్వాల్సిన నా అక్షరాలు ఎదో ఒక మూలలో మూలుగుతున్నాయి మువ్వలా మోగాల్సిన నా మదిలో ఎగిసిపడే కావ్య రావాలు బాధ్యతల బరువులో జీవాలు కోల్పోయి వాడిగా నను వేటాడుతున్నాయ్ నా కలల కలం రాల్చే కార్చిచ్చు లావాలు ఎగసిపడే ప్రతి సారీ శారీ ఎప్పుడు కొంటారు శాలరీ ఇంకా రాలేదా లాంటి శత సహస్ర -అస్త్రాలతో నాలోని కవిని నిస్త్రాణం చేసి కలల్ని కాలం లో కలిపేస్తూ -శిలలా బ్రతుకుతున్న -శిథిలమై పోతున్న .

  • @vimalavimmu4424
    @vimalavimmu4424 Жыл бұрын

    eerogullo elanti message oriented films.. Raavadam impossible... Thanks for showing simplicity of middle class dreams.... 😊💛🙏🙏😍

  • @satyabangaru2236
    @satyabangaru2236 Жыл бұрын

    బాగా కనెక్ట్ అయ్యేలా ఉంది తాత గారు

  • @bapanapallivenkatanagasaik9430
    @bapanapallivenkatanagasaik9430 Жыл бұрын

    Rachayatha thana gurinchi prapanchaniki telavali anta thanu rasa aksharalo unda ardham, bhavam samthulyam ga untana, aa kadha ki pranam maryu villuva. Meru chepina e kadha lo oka jeevitham undi.. jeevetham anta andaru putuka maryu chavu antaru. Kani na udhasamlo jeevitham anta oka badhyatha dhnaitho patu mana kalalu neraverchukovadam. Ala Ani badhyatha valla kalalu mathram chapukokandi...... Thanks LB Sriram garu comming up with such a beautiful story and line up......

  • @kranthi143B
    @kranthi143B Жыл бұрын

    కల కాలానికి సంబంధించినది. కళ మనసుకు సంబంధించినది.

  • @pavant5172
    @pavant5172 Жыл бұрын

    Bharath anna neku pedda fan Anna nenu Chala bagundi series ❤️

  • @iamnode2088
    @iamnode2088 Жыл бұрын

    master piece epudu antharmadhanam lo vuna athma vedhanaku oopiri iche mee matalu maa jeevithanaiki jaagrutha geethalu

  • @triveni8172
    @triveni8172 Жыл бұрын

    Director garu really heart touching story rasaru prithi meaning chala Baga varuniecharu super sir

  • @seedralapoornachandrarao
    @seedralapoornachandrarao3 ай бұрын

    🇮🇳చాలా బాగున్నది అద్భుతం ❤️

  • @itsmeshanthi5564
    @itsmeshanthi5564Күн бұрын

    శ్రీరామ్ గారూ ఎంతబాగా matladaru

  • @thedancebeatstudio5943
    @thedancebeatstudio5943 Жыл бұрын

    ఈ చిత్రం ఒక అద్భుతం💫❤️

  • @tippiriakilesh
    @tippiriakilesh Жыл бұрын

    సార్ అద్భుతం 💞💞ఇంతకన్నా ఎక్కువ నేను ఏమీ చెప్పలేను 💞🎊

  • @m.s.goutham8940
    @m.s.goutham8940 Жыл бұрын

    Dear Srikanth, just finished viewing your short film. Felt very happy looking at two of my past students, you behind the camera and Suchala in front of the camera. SUUUUUUUUUPER effort. Hearty congratulations to the whole team & regards to Sri. Sriram garu. KEEP GOING. ALL THE BEST.

  • @nageshwarmula380
    @nageshwarmula380 Жыл бұрын

    Chala బాగుంది మీయొక్క staff అందరకు ధన్య వాదములు సర్

  • @shivasave
    @shivasave Жыл бұрын

    ముగింపు అర్థం కాలేదు.మనలోని కళని వదిలేయాలా లేక కొనసాగించాలా

  • @saiduluburugu7378
    @saiduluburugu7378 Жыл бұрын

    జై భీమ్

  • @manjulathag4298
    @manjulathag4298 Жыл бұрын

    నిజానికి మనిషి కి చివరి దశ లో తన కళ కూడా తనతో ఉండదు...... ఒక వేళ ఆ కళ వల్ల పేరు ప్రతిష్ట లు ఆస్థి పాస్థులు వచ్చి ఉంటే అవి మాత్రమే మిగులుతాయి..... అవి కూడ తోడు లాగ అనిపించదు సాటి మనుషుల తో కలిసి మెలిసి ఉండటం (తన కుటుంబం అయినా కాక పోయినా కూడ ) మాత్రమే ఆనందాన్ని ఇస్తుంది

  • @rajeshvarig3780
    @rajeshvarig37809 ай бұрын

    ప్రతి అక్షరం కన్నబిడ్డ లా అనిపించేది.ఎంత భావుకత దాగి ఉందో

  • @alberttrinadh890
    @alberttrinadh890 Жыл бұрын

    నాలోని రచయితకు ప్రతి ఉదయం మరణం EVRU SIR AA LINE RASINDHI,,,,,, Aaaa pain oka writer ki mathramey ardhamvthundhi

  • @Chanduedits2.o
    @Chanduedits2.o2 ай бұрын

    జీవిత సత్యాన్ని ఆవిష్కరించారు

  • @swethaguduri6579
    @swethaguduri6579 Жыл бұрын

    Thank you so much SIR for your meaningful message...🤝

  • @sreedharrepakula8628
    @sreedharrepakula8628 Жыл бұрын

    My dear Super Star of short films, one more nice story from you. A really appreciable solution. Live for our family 👍👍👍👍

  • @darshinisiripuram5167
    @darshinisiripuram5167 Жыл бұрын

    Really heart touchingg...🥰🥰🥰😍😍😍😘

  • @alamandasrinu2690
    @alamandasrinu2690 Жыл бұрын

    Blockbuster Comeback Sir Super super చాలా బాగుంది సార్ అద్భుతం

  • @apoorvagupta214
    @apoorvagupta214 Жыл бұрын

    As an Artist I always struggle between choosing my passion and a job to survive. The movie showed this dilemma beautifully. A must watch 👍👍 looking forward to more such movies from you guys. All the best!

  • @_prabha_kommu7218
    @_prabha_kommu7218 Жыл бұрын

    No words sir. Super 🙏🙏🙏🙏🙏🙏

  • @satishdesala6473
    @satishdesala6473 Жыл бұрын

    ఇ కధ మొదటి లోనే చివర నీ ఊహించాను ఎందుకంటే కళ్ళలో అసలు నింపుకుని భాద్యతలు భుజాలు పై మోసే యువకుడు నీ

  • @nlakshmi4225
    @nlakshmi42255 ай бұрын

    నన్ను నేనుకోల్పోయిన వైనం. నావృత్తి కీ ప్రవృత్తి కీ నామానసిక ప్రవర్తనకీ బాహ్య ప్రవర్తనకీ పొంతన లేనీ జీవనయానం. ఏమాత్రం సంబంధం లేని పోరాట మనుగడ. ఇదేననుకుంటా విధిలిఖితం.

  • @dadivenkat4213
    @dadivenkat4213 Жыл бұрын

    Those who are in dilemma about life has to see this episode. Excellent.

  • @venkatreddy7135
    @venkatreddy71354 ай бұрын

    కళ ఎంతోమంది జీవితాలకి దగ్గరగా జీవితంలో తనని తాను వెతికే సారథి అలాంటి కళను త్యాగం చేస్తే లక్షల మంది అంతరంగాన్ని అవిష్కరించకుండా ద్రోహం చేసిన వారవుతారు

  • @komatirajkumar1430
    @komatirajkumar1430 Жыл бұрын

    చాలా బాగుంది.

  • @facebook9504
    @facebook9504 Жыл бұрын

    Vintage actor come back in short film 💥

  • @varun3748
    @varun3748 Жыл бұрын

    This movie is made so intellectually... It could hold back the audience with such an amazing dialogues and interesting flow. Congratulations. We need more from you ❤️

  • @bontalachiranjeevi7056

    @bontalachiranjeevi7056

    Жыл бұрын

    Hi bro small doubt Final ga compromise avvalsindega family and job...

  • @sitaiahmaguluri7187

    @sitaiahmaguluri7187

    Жыл бұрын

    This movie is made so intellectually . It could hold back the audience with such an amazing dailogs.

  • @revuriprasanthi4333
    @revuriprasanthi4333 Жыл бұрын

    Hat's off to the writer and entire team of this short best film. Because I am suffering with the same dilemma of protagonist. L.B .bhayya.you gave nice answer to many like me. We need more like this special short film.

  • @swamydevi1998
    @swamydevi1998 Жыл бұрын

    Yeanto mandi jeevithalu mee story dwara chupincharu guruvu garu 99% manushula jeevithalalo vallu anukona jeevitham leada cheayatam leadu

  • @TemplesGuide
    @TemplesGuide Жыл бұрын

    చాలా బాగుంది అండి ..

  • @madhubollimuntha3035
    @madhubollimuntha30353 ай бұрын

    మనిషిని దహించేది మనసు. మనం చేసే తప్పును మన మనసే ప్రశ్నిస్తుంది. మన కన్యాయం జరిగితే వాడిపై తిరగబడు అని చెప్తుంది.. అలాంటి తిరుగుబాటును మాత్రం ఏ మనిషి కోల్పోకూడదు🎉❤😊

  • @ishaqahmedshaik9281
    @ishaqahmedshaik9281 Жыл бұрын

    Superb shortfilm!Most relevant to the present times- conflict between Responsibilities and passion!Very nicely shown!Thanks very much LB Shriram Sir and team!

  • @nikhilgoud6118
    @nikhilgoud6118 Жыл бұрын

    😭😭😭😭 touching heart bro

  • @hemakotvali2217
    @hemakotvali2217 Жыл бұрын

    very beautiful. These days man only think of themself, selfishly but what the hero took decision was the right one. Its not just his wife and many around them that will be happy one single person's selfless decision.

  • @hemanthaugust7217
    @hemanthaugust7217 Жыл бұрын

    na vaalla gelupu mundu na ootami chaala chinnadi...ide pratee magadu & nanna chesedi...kaane enduko nanna venakapadipoyadu (Tanikella Bharani gari speech lo chepinattu) ..great video sir LB Sriram garu!!

  • @shailajaguntipally2923
    @shailajaguntipally2923 Жыл бұрын

    నమస్కారం అండి LB Sriram gaaru🙏

  • @prasad8738
    @prasad8738 Жыл бұрын

    Each sentence, each word makes feel high.without any bgm we are in trance with their voice and dialogues...

  • @sumasri266
    @sumasri266 Жыл бұрын

    Excellent Team effort 👌👌 Brilliant screen play👏👏 Real story of every struggling movie technician

  • @arjun__Yadav4046
    @arjun__Yadav4046 Жыл бұрын

    this 21 minutes shor film used for taking my own decision tq to all team

  • @satyanarayanaputcha5604
    @satyanarayanaputcha5604 Жыл бұрын

    Mana valla Kosam manam compromise avvadam thappu kaadu Ee video lo last dialogue adbhutham Mana kala Kosam manavallani risk lo pettakudadu

  • @sekharr4163
    @sekharr4163 Жыл бұрын

    Excellent. Great film. Appreciated complete team. You done an excellent job. Sriram garu take a Bow.

  • @iamnode2088
    @iamnode2088 Жыл бұрын

    chala kalam ga wait chesthuna new video kosam

  • @aerrollamounika4700
    @aerrollamounika4700 Жыл бұрын

    What a message 👏👏screen play 🔥

  • @venkataramanacreations414
    @venkataramanacreations414 Жыл бұрын

    అక్షరాన్ని.. మాటలు చేసి. మాటలని. ఒక సందర్బంగా రాశాను. కెమెర..కంటికి రావాలి అంటే కరెన్సి కట్ట కావాలి..అవి లెవు అందుకే. ఈ రచయత గా గుర్తింవు రాదు.. రచయిత మనసు మరొక రచయిత తెలుస్తుంది 🙏నాకు అవకాశం వుంటుందా..? సార్

  • @shidduroacher8576
    @shidduroacher8576 Жыл бұрын

    What a beautiful film it it 😍❤️ Each one Dialogues and characters are superb.👌

Келесі