గోపీచంద్ ధర్మవడ్డీ కథ | Dharmavaddi | Gopichand | Telugu stories | Rajan PTSK

Ойын-сауық

తెలుగులో ఉత్తమస్థాయి రచయితలు ఎందరో ఉన్నారు. ఒక్కొక్కరిదీ ఒక్కోవిధమైన రచనా శైలి. ఆయన శైలి ఇలా ఉంటుంది. వారు వ్రాసిన కథ ఇది, నవల ఇది అని పరిచయం చేయడం వల్ల ఆ రచయితల గురించి మీకు మంచి అవగాహనే వస్తుంది. అయితే దానితో పాటూ వారి రచనలు కొన్నింటిని యథాతధంగా వినిపిస్తే మరింత ఆనందం కూడా కలుగుతుందన్నది నా భావన. అందులో భాగంగానే చాలాకాలం క్రితం గురజాడ అప్పారావు గారి దిద్దుబాటు కథను వినిపించాను. అయితే కాపీరైట్ పాలసీల వల్ల ప్రసిద్ధ రచయితల్ అందరి కథలనూ ఇలా వినిపించడం కుదరదు. కేవలం కాపీరైటు కాలపరిమితి పూర్తయిపోయిన రచనలనే మనం చెప్పుకోగలం. అందులో భాగంగా ఈరోజు మనం త్రిపురనేని గోపీచంద్ గారి ధర్మవడ్డీ అనే కథను చెప్పుకుందాం. అసమర్థుని జీవయాత్ర, పండిత పరమేశ్వరశాస్త్రి వీలునామా వంటి నవలలతో రచయితగా, తాతత్వికుడిగా తానెంత ఎత్తో నిరూపించుకున్నారు గోపీచంద్. అలానే భారతీయ, పాశ్చాత్య తత్త్వాల గురించి వారు రచించిన తత్త్వవేత్తలు పుస్తకం అయితే తెలుగులో తప్పక చదవాల్సిన పుస్తకాలలో ఒకటిగా ఎప్పటికీ నిలుస్తుంది. అటువంటి రచయిత రచించిన ఓ కథను ఈరోజు మనం చెప్పుకుందాం. కథ పేరు ధర్మవడ్డీ. వీడెంత కర్కోటకుడురా అనిపించే మనుషులు మనకు అప్పుడప్పుడూ తారసపడుతూనే ఉంటారు. మనకు తెలిసినా తెలియకపోయినా వారి కర్కోటకత్వం వెనుక ఏదో ఒక బలమైన కారణం కూడా ఉండే ఉంటుంది. అలా అని ఎవరూ ఆ కర్కశత్వాన్ని సమర్థించరు. అయితే అంతటి కర్కోటకుడు కూడా ఒకవేళ బలహీనపడితే అంతవరకూ అతనంటే భయపడ్డ బలహీనులు కూడా అతడిపై తమ ప్రతాపం చూపించడం మొదలుపెడతారు. అతడికంటే కర్కశంగా ప్రవర్తిస్తారు. ఎన్ని విధాల అతణ్ణి బాధపెట్టాలో అన్ని విధాలా బాధపెడతారు. అదంతా చూసేవాళ్ళలో చాలామంది కూడా అతగాడికి తగిన శాస్తి జరిగిందనే సంతోషిస్తారు తప్ప.. ఆ సమయంలో వారికి మానవత్వం గుర్తుకురాదు. ఒకప్పుడు అతడు మానవత్వం మరచిపోయి ప్రవర్తిస్తే అవకాశం చిక్కగానే వీళ్ళూ మానవత్వం మరచిపోతారు. అంటే ఇక్కడ మంచి చెడు అన్న విషయంలో తీర్పు చెప్పేపెద్దమనిషి ఎవరూ అంటే.. ఆ పెద్దమనిషి పేరు అవకాశం. అలానే మంచివాడు, చెడ్డవాడు ఈ ఇద్దరిలో ఎవరు బాధితుడూ అంటే.. ఆ ఇద్దరిలో ఎవరు బలహీనుడైతే అతనే బాధితుడు. ఈ విషయాలేవీ రచయిత నేరుగా మనకేమీ చెప్పడు. కేవలం కథ చెబుతాడంతే. గోపిచంద్ అనే కాదు ఏ గొప్ప రచయితైనా అంతే. ఆ కథలో అంతరార్థాన్నీ, రచయిత హృదయాన్నీ పట్టుకుంటేనే కానీ నిజానికి మనకు ఏ కథా పూర్తిగా అర్థం మైనట్టు కాదు. మనిషి నైజంపై గోపీచంద్ గారు పలికించిన భావనే, వేదనే ఈ ధర్మవడ్డీ కథ.

Пікірлер: 30

  • @nageswararaokommuri2815
    @nageswararaokommuri2815Ай бұрын

    వడ్డీ వ్యాపారం ఒక్కటే ఆనాడూ .... ఈనాడూ .... ఏనాడైనా .... మార్పులేనిది

  • @RamareddyMallidi-oo6sd
    @RamareddyMallidi-oo6sd2 ай бұрын

    గోపిచంద్ గారు చక్కని కథని రచించారు, మీరు ఇంకా చక్కగా సారాంశం అర్థం అయ్యేలా వివరించారు. 🙏 నీతి : ఇక్కడ మంచి చెడు అన్న విషయంలో తీర్పు చెప్పే పెద్దమనిషి ఎవరూ అంటే "అవకాశం". అలానే మంచివాడు చెడ్డవాడు ఈ ఇద్దరిలో ఎవరు బాధితుడూ అంటే ఆ ఇద్దరిలో ఎవరు "బలహీనుడైతే " అతనే బాధితుడు.

  • @AnilAtluriWord
    @AnilAtluriWord2 ай бұрын

    13:18 కాదనుకుంటాను. 'సున్నంలోకి ఎముకలు లేకుండా ' అని వుండాలనుకుంటాను.

  • @Ajagava

    @Ajagava

    2 ай бұрын

    "అలకనందా" ప్రచురణలోను, విశాలాంధ్రవారి "100 వసంతాల తెలుగు కథ" సంకలనం లోను కూడా "సున్నం మీద ఎముక లేకుండా" అనే ఉండటంతో నేను ఆ మాట మార్చడానికి సాహసించలేదండి.

  • @lakshminandula5303

    @lakshminandula5303

    2 ай бұрын

    బలవంతమైన సర్పము చలి చీమల చేత చిక్కి చావదె సుమతీ.. మనిషులము అ వకాశ వాదుల మా .. అందితే జుట్టుూ , అందక పోతే కాళ్ళు ఏమైనా మనుషులమైనందుకు ఆత్మ విమర్శ చేసుకుంటూ మరీ అలవాట్లకు బానిసలుకాకుండా .. జీవించటానికి …🤝👌👍👏🙌

  • @kadhalahari-dr.gayathrisub7119

    @kadhalahari-dr.gayathrisub7119

    2 ай бұрын

    మీరు చెప్పింది కరెక్ట్ అండి సున్నం లోకి ఎముకలు మిగలకుండా అన్న మాట కరెక్ట్ ఆ పుస్తకాల్లో తప్పు ప్రింట్ అయింది

  • @muralikrishnabhuvanagiri5766
    @muralikrishnabhuvanagiri5766Ай бұрын

    Dear Sir, Jai Sri Ram ! Thank you very much for your great services. Wish You All The Best. Bharat Mata Ki Jai ! Jai Hind !

  • @eswarbujji84
    @eswarbujji842 ай бұрын

    కళ్ల వెంట నీరు ఆగలేదు గురువు గారు

  • @pullaiahpalempally3508
    @pullaiahpalempally35082 ай бұрын

    Sir an excellent story of human habits, Namesthe.

  • @dharmakornana5497
    @dharmakornana54972 ай бұрын

    గోపీచంద్ గారి రచనలు అద్భుతం 👏👏👏

  • @SameerDharmasastha
    @SameerDharmasastha2 ай бұрын

    బావుందండీ 🙏

  • @moyilisriramulu3614
    @moyilisriramulu3614Ай бұрын

    మంచికధ

  • @veerusunkara2471
    @veerusunkara24712 ай бұрын

    Heart touching story 😢

  • @srinur6556
    @srinur65562 ай бұрын

    Rajan garu mee mida gouravam perigindi

  • @venkateswarlub3212
    @venkateswarlub3212Ай бұрын

    Thanks Anna

  • @GullapalliRajyalakshmi-kp5rc
    @GullapalliRajyalakshmi-kp5rc2 ай бұрын

    సూరయ్య ఖర్మ ధర్మవడ్డీ కథ .

  • @banothsurender3148
    @banothsurender3148Ай бұрын

    👍

  • @Ch.ramanaMurty
    @Ch.ramanaMurtyАй бұрын

    Dd8 lo chusa Surya act chesadu

  • @janardhanaswamykuchibotla6477
    @janardhanaswamykuchibotla64772 ай бұрын

    Great analysis

  • @lakshminandula5303
    @lakshminandula53032 ай бұрын

    👌👍👏🙌🤝 ..

  • @mohanvasu198
    @mohanvasu1982 ай бұрын

    🙏

  • @bharathsai1242
    @bharathsai12422 ай бұрын

    'Asamardhuni Jeevayathra' kuda cheppandi

  • @srinivasgurram3586
    @srinivasgurram35862 ай бұрын

    😢

  • @KrishGbv
    @KrishGbv2 ай бұрын

    Sir, can You please read ' Patanjali Sutras' and bhashyams.

  • @mandlarangaswamy9510
    @mandlarangaswamy95102 ай бұрын

    కథ ఉంటే pdf పంపగలరు

  • @yekkalurjahangeer3008
    @yekkalurjahangeer30082 ай бұрын

    🌹🙏 Namaste sir

  • @mkrishna1062
    @mkrishna10622 ай бұрын

    😂

  • @vijayalakshmiputta6666
    @vijayalakshmiputta66662 ай бұрын

    ప్రస్తుత తరానికి అన్వయం అయ్యే విధంగా ఈ కథలోని పాత్రలు దర్పణం పడుతుంది🫣

Келесі