ఏ దేశమేగినా….. గేయం।

ఏ దేశమేగినా ఎందు కాలెడినా
ఏ పీఠమెక్కినా, ఎవ్వరేమనినా,
పొగడరా నీ తల్లి భూమి భారతిని,
నిలపరా నీ జాతి నిండు గౌరవము.
ఏ పూర్వ పుణ్యమో, ఏ యోగ బలమో
జనియించినాడ వీ స్వర్గఖండమున
ఏ మంచిపూవులన్ ప్రేమించినావో
నిను మోచె ఈ తల్లి కనక గర్భమున.
లేదురా ఇటువంటి భూదేవి యెందూ
లేరురా మనవంటి పౌరులింకెందు.
సూర్యునీ వెలుతురుల్ సోకునందాక,
ఓడలా ఝండాలు ఆడునందాక,
అందాక గల ఈ అనంత భూతలిని
మన భూమి వంటి చల్లని తల్లి లేదు
పాడరా నీతెలుగు బాలగీతములు
పాడరా నీ వీర భావ భారతము.
.
.
.
#5వతరగతి #kids #trending #kidsphonicsong #kidsvideosforkids #trendingshorts #kidsvideo #viralvideo #గేయం #తెలుగు గేయాలు #రాయప్రోలు సుబ్బారావు గారు

Пікірлер

    Келесі