Bale Balendu Rethigowla Bombay Sisters Sri Thyagaraja Thiruvaiyaru Kshethra Krithis 2

Пікірлер: 1

  • @saichandnandanavanam8468
    @saichandnandanavanam84687 ай бұрын

    ప. బాలే బాలేందు భూషణి భవ రోగ శమని అ. ఫాల లోచని శ్రీ ధర్మ సంవర్ధని సకల లోక జనని (బా) చ1. శీలే నను రక్షింపను జాగేలే పరమ పావని సుగుణ జాలే నత జన పరిపాలన లోలే కనక మయ సు- చేలే కాల వైరికి ప్రియమైన ఇల్లాలవైయిందు వెలసినందుకు శ్రీ లలితే నీ తనయుడని నను కుశాలుగా పిలువ వలెనమ్మ (బా) చ2. సారే సకల నిగమ వన సంచారే చపలా కోటి నిభ శరీరే దేవతాంగనా పరివారే పామర జన దూరే కీర వాణి శ్రీ పంచ నద పుర విహారివై వెలసినందుకిక నా నేర కోటులనెల్ల సహించి గారవింప వలెనమ్మ శివే (బా) చ3. రామే ప్రణతార్తి హరాభి- రామే దేవ కామినీ లలామే త్యాగరాజ భజన స- కామే దుర్జన గణ భీమే నా మనసు నీ చరణముల సదా నేమముతో పూజ సేయని శ్రీ రామ సోదరివై వెలసిన శ్రీ శ్యామళే ధర్మ సంవర్ధని (బా)

Келесі