YVG ANNAMAYYA AKSHARA VEDAM

YVG ANNAMAYYA AKSHARA VEDAM

I DO NOT OWN ANY COPY RIGHTS OF THE AUDIOS / VISUALS / PHOTOS USED IN THIS CHANNEL CONTENT .

ALL ARE COLLECTED FROM INTERNET / TTD WEB SITE / SVBC CHANNEL ETC TO FAIRLY USE THE CONTENT TO PROPAGATE THE GREATNESS OF ANNAMACHARYA SANKEERTANS IN ITS LITERARY AND SPIRITUAL VALUE !

THIS IS PURELY A SERVICE TO THE LOTUS FEET OF THE LORD AS AN EDUCATING MEDIA SHARING THE LYRICS AND MEANINGS OF ANNAMAYYA SANKEERTANAS !

NO COPY RIGHT INFRINGEMENT INTENDED !

RESPECTIVE COPY RIGHT OWNERS ARE FREE TO INFORM ME , IF THEY FIND ANY CONTENT OF THEIR OWN AS OBJECTIONABLE POSTING HERE ! [email protected]

OM NAMO VENKATESAYA !

IAM MAKING A HUMBLE EFFORT TO BRING AS MANY KEERTANAS AS POSSIBBLE
OF SRI ANNAMYYA AS WEEKLY EPISODE SERIES .
THESE VIDEOS CAN BE VIEWED IN A SINGLE WINDOW WITH LYRICS ,
IN TELUGU AND WITH MEANING IN ENGLISH .


OM NAMO NARAYANAYA


Пікірлер

  • @ramaraoayithy9472
    @ramaraoayithy94728 минут бұрын

    Om namo narayana govinda govinda

  • @anuradha3601
    @anuradha360118 сағат бұрын

    Om namah shivaya

  • @suryakumarianappindi9968
    @suryakumarianappindi996822 сағат бұрын

    Mohana ragam ?

  • @yvgannamayyaaksharavedam6942
    @yvgannamayyaaksharavedam694222 сағат бұрын

    Mohana ragam kaadandi composed by Sri G. Balakrishna Prasad garu in Sriragam and adithalam Video title card lo , video lo kooda mention chesaanu

  • @suryakumarianappindi9968
    @suryakumarianappindi996819 сағат бұрын

    @@yvgannamayyaaksharavedam6942 sorry choodaledu🙏🙏🙏

  • @user-ts3ns8xe7f
    @user-ts3ns8xe7fКүн бұрын

    Om namo venkatesaya Govinda Govinda

  • @rammohangodthi
    @rammohangodthiКүн бұрын

    Superb superb 🌺

  • @yvgannamayyaaksharavedam6942
    @yvgannamayyaaksharavedam694218 сағат бұрын

    Many many thanks

  • @vijayabharathialluri1023
    @vijayabharathialluri1023Күн бұрын

    Om Rakshakaya Namaha🙏🙏🙏 Super Sankeertana; bhaavaartham Chaala Baaga vivarincharu Adbhutamaina Bhavamunu wonderful drusyamalika;tho; excellentga present chesaru; Very nice, Pradhana: Sri Venugopal Garu Abhinandanalu🙏 Adbhutamga sungby pRanganath Garu; Sri Venkatesa Pahimam Pahimam Sri Srinivasa Rakshamam Rakshamam🙏🙏🙏 Sri Venkata Nayaka bless you🙏

  • @yvgannamayyaaksharavedam6942
    @yvgannamayyaaksharavedam6942Күн бұрын

    అమ్మా చాలా ధన్యవాదములు మీ అభినందనలకు

  • @BhulakshmiNallamothu
    @BhulakshmiNallamothuКүн бұрын

    Ma addiction Annette medha kottavaiah clear way.

  • @parvateesamvepa6303
    @parvateesamvepa6303Күн бұрын

    సామాన్య మానవులందరికీ ఉండే సాంసారిక యాతనల వల్ల నీపై బుద్ధిని నిలుపు వీలౌతుందా?!!! ఓం వేంకటేశాయ....మమ్ములను యీ ఈతి బాధలకు దూరం చేసి నీపైన భక్తితో నీకు దగ్గరయేలా కాపాడు తండ్రీ అనే యీ అన్నమయ్య కీర్తన చాలా చాలా బాగుందండీ... మీరు యిచ్చిన ఆంధ్ర ఆంగ్లభాషలలో వ్యాఖ్యానములు యెంతో బాగున్నవి. ప్రారంభంలో కీర్తన భావార్ధాన్ని మీరు రచించిన కంద పద్యంలో అమోఘమైన రీతిలో చిత్రించారండీ ... మీరు ఎడిటింగ్ చాలా చాలా గొప్పగా చేసేరు. మీకు అనేకానేక అభినందనలండీ. శ్రీ పారుపల్లి.రంగనాధం గారు చాలా బాగా గానం చేసేరు.... 🌹💐🙏🙏🙏🙏🙏💐🌹

  • @yvgannamayyaaksharavedam6942
    @yvgannamayyaaksharavedam6942Күн бұрын

    @@parvateesamvepa6303 మీ అపురూపమైన సందేశమునకు ధన్యవాదములండి . నమస్సులు . మీకు నచ్చినందులకు సంతోషముగా ఉన్నది

  • @yvgannamayyaaksharavedam6942
    @yvgannamayyaaksharavedam6942Күн бұрын

    🌺☘ ------------☘🌺 ANNAMAYYA AKSHARA VEDAM EPISODE - 482 ( DAIVAMA NEE PERAREPANALIVI ..) 🌺☘ ------------☘🌺 PREFACE :-- 🌹👇 This nature and all its grandeur and illusions are the incitements of The Supreme ! 🙏 To know these completely, or to defy these and act as independent beings , it is not possible for any of us.🙏 Hence Annamayya says that Everything Is At The Discretion Of The Lord !Seek His Mercy Always !🙏 Here goes the interesting keertana as below ! 👇 🌺☘ ------------☘🌺 🌹🌹 Oh Lord ! You Are The Driving Force Of All Our Deeds , And It Is Your Instigation !🙏 Your Instigation Is Inevitably Present In This Nature To All The Beings Here🙏 Even by Inquiring Ourselves it is Impossible To Oppose This and Shove it Away . It Is Neither Possible To Lord Brahma And Gods Too !🙏 🌹🌹 How Is It possible To Accomplish Bachelor State with Chastity ?🙏 When We Glance At Lovely And Beautiful Ladies In Front Of Us , It Is A Fact That , It Stirsup Our Mind Within , To Adultery At Ease !🙏 When We Find All The Wealth And Riches At Our Hand Reach , All Put Together In A Single Way , They Delude Us And Make Us Sink To possess Them🙏 🌹🌹 Can We Be In A State Of Satiation After Seeing Innumerable Commoddities And Tasty Things In The Open Market ?🙏 With Exceeding Fondness Of Seeking Them , Is It Not The Fact That Our Mouths Become Watery Desiring Them All !🙏 Conveniently In What Way Can We Attain The State Of Profound Meditation ?🙏 When We Find The Pride Of The Marching Processions Of Horses And Elephants They Make Us Delightful By making Us Wander To Every House And Street Along With Them !🙏 🌹🌹 In What Way Can Our Thoughts Be Focussed Upon You Alone ! Oh Lord ?🙏 When We Are Seeing So many Pleasures And Joyful Things Of The Mundane World , These Pleasures Are Hanging On Us As Heavy Loads making Us Weary And They Are Provoking Us To Do So Many Tasks for our Livelihood !🙏 Being In This World When Can I Conquer All These ? Oh Apt And Able Lord Sri Venkateswara ! Oh Lord By Showing Love Upon Us , Please Protect Us From These Delusions , This Will Become As The Greatest Help That you Have Done For us !🙏 🌹🙏🌹 Om Sri Alamelumanga Sametha Sri Venkateswara Swaminey Namaha !🙏 🌹🙏🌹 ✍ --Venu Gopal

  • @yvgannamayyaaksharavedam6942
    @yvgannamayyaaksharavedam6942Күн бұрын

    🌹🌹 సంకీర్తన 🌹🌹 ॥పల్లవి॥ దైవమా నీపెరరేఁపణ లివి తప్పక వున్నవి జీవులకు భావించి కాదని దొబ్బి దీకొనఁగ బ్రహ్మాదులకైనను వసమా ॥చ1॥ యెక్కడ సిద్ధించు బ్రహ్మచర్యము యెదుటనే కాంతలఁ జూచినవేళను చక్కఁగా మనోవ్యభిచారంబునఁ జలియించుం గాక చిక్కునే విరతి ధనధాన్యంబులు చేతికి లోనయినఁ జూచి వొక్కటియై తా నండే మగ్నము నొందించుం గాక ॥చ2॥ కలుగునే తనివి బహుపదార్థములు గక్కన నంగళ్లనుఁ జూచి కొలఁదిమీఱఁ గడుతరితీపులతో కోరుచు నోరూరుం గాక వలనుగ సమాధి యెటువలె దొరకొను వాజవారణంబులఁ జూచి యెలమితోడ ముంగిళ్లనెల్లఁ జరియింపించుఁ గాక ॥చ3॥ యేరీతి నెలకొను నీమీఁదితలఁపు యిహలోకపుసౌఖ్యము చూచి భారపు లంపటములు పై దగిలించి పనులకుఁ బురికొలుపుఁ గాక ధారుణి నే నివి గెలుచుట యెన్నఁడు తగ శ్రీవేంకటనాయక నీవే గారవించి రక్షింపుము నీ కిది కడునుపకారంబౌఁ గాక 🌹🙏🌹🙏🌹

  • @yvgannamayyaaksharavedam6942
    @yvgannamayyaaksharavedam6942Күн бұрын

    🌺🍃 ------------🍃🌺 అన్నమయ్య అక్షరవేదం ..సంపుటి -- 482 ( దైవమా నీపెరరేపణ లివి తప్పక వున్నవి జీవులకు .. ) 🌺🍃 ----------- 🍃🌺 ఓం నమో వేంకటేశాయ. 🙏 అన్నమయ్య అక్షర వేదం ..సంపుటి -- 482 కి శుభ స్వాగతం ..🙏 ప్రార్థన ః--🌹🙏 నీవే ప్రేరేరింపగ మావల్ల వశమదియౌనె? మహినల్పంబౌ జీవులమీ మాయ నెరుగ , దైవశిఖామణివి నీవె దరిఁజూపుమయా !! 🌹🙏🌹 ✍ --స్వీయపద్యము ( కందము ) 🌹🌹 స్వామీ ! నీవు చలింపచేయుట వల్లనే కదా , ఈ సృష్టి అంతా ఒక మాయగా నడుచుచున్నది !🙏 బ్రహ్మాదులకైనా తరముకానప్పుడు , ఈ భూమిపై అల్పులమైన జీవులము , మా తరమౌనా నీ మాయలను ఎరిగి వాటిని తొలగించుకొనుటకు ?🙏 దేవతలనందరినీ సృష్టించి పోషించి పాలనము చేసే ఓ దేవదేవోత్తమా , నీవే దయచూపి , నిన్ను తెలుసుకోగలిగెడి , సుజ్ఞానతీరంబునకు మమ్ములను చేర్చవయ్య !!🙏 🌹🌹 🌺🍃 -----------🍃🌺 మున్నుడి ః-- 🌹👇 దైవ సంకల్పితములైనవే ఈ ప్రకృతియునూ యిందలి మాయలన్నియును , వీటిని సంపూర్ణముగా తెలుసుకొనుటకు గాని , వీటిని ధిక్కరించి స్వతంత్రులుగా నడుచుకొనుటకు గానీ మనకెవ్వరికీ సాధ్యము కాని పని అని అంటున్నారు అన్నమయ్య .🙏 వీటి బారిన పడి , వ్యధలకు గురికాకుండా చేయగలిగేది ఆ పరమాత్ముడొక్కడే , కావున ఆతని శరణమును వేడుటయే మనము చేయగల పని అంటున్నారు చక్కని ఉదాహరణలను చెపుతూ .🙏 మరి ఆ చక్కని సంకీర్తన అర్థము తెలుసుకుని పాడుకుందామా !👇 🌺🍃 ----------- 🍃🌺 🌹🌹 ఓ పరమాత్మా ! నీ ప్రేరేపణతోనే ఈ సృష్టి రచన జరిగి , ఎన్నెన్నో వింతలు , మాయాజాలముగా మా ఎదుటనే ఉన్నవయ్యా !🙏 జీవాత్మలమైన మేము ఈ ప్రకృతి మాయకు లోనగుట తప్పదు ! 🙏 నిజానికి ఆ బ్రహ్మాదులకు సైతము నీ మాయలు కాదని తలంచి ప్రక్కకు నెట్టివేసి ఉండటము సాధ్యమైన పనియేనా ప్రభూ ?🙏 🌹🌹 పరకాంతలకు అతీతులమై బ్రహ్మచర్యమును ప్రాప్తము చేసుకొనుట సాధ్యమయ్యే పమియేనా , కళ్లెదుటనే సుందరాంగనలెందరెందరో మాకు కనిపిస్తూ ఉంటే ?🙏 తేలికగా మా మనస్సులలో ఇది అనుచితమగు ఆలోచనలను కల్పించి మనసులోనైనా వ్యభిచారము చేయించుటయే కాక ఇంకేమిటి ! 🙏 విషయ సుఖములందు ఆపేక్ష లేని విరతి స్థితి మాకు అందుట అన్నది ఉన్నదా ? 🙏 మా చేతికి చేరువలోనే ధనధాన్యాది ఐశ్వర్యములు కనిపిస్తూఉండగా వాటికి లోబడి ఉంటామే గాని త్యజిస్తామా ?🙏 ఆ ఐశ్వర్యములన్నీ ఒక్కటై మమ్ములను వాటియందే మునిగిపోయేటట్లు చేస్తాయి గాని వేరేమియునూ కాదు ! 🙏 🌹🌹 సంపూర్ణమైన సంతృప్తి అన్నది అసలు కలుగుతుందా మాకు?🙏 ఇదిగో ఈ అంగళ్ల నిండా ఉన్న సరుకులను , రుచికరమైన వస్తువులనూ చూడగా , వాటియందే మనసుపోయి వాటి అన్నిటి రుచి చూడాలన్న నోరూరుట కాక ఇంకేమిటి ?🙏 ఒప్పిదముగా మాకు అచలమైన , నీ తదేక ధ్యానస్థితిలో ఉండే భాగ్యము ఏ విధముగా దొరుకునయ్యా ? 🙏 మా చుట్టూ ఇదిగో గుర్రాలు ఏనుగులపై రాచరికపు మర్యాదల ఊరేగింపులు కనిపిస్తూ ఉండగా ! 🙏 మేము వాటికి ఆసక్తులమై వాటివెంట ఇళ్ళు వీధులూ సంచరిస్తూ ఉంటాము గాని నీ మీద ధ్యాస ఎక్కడిది !🙏 🌹🌹 అసలు ఏ విధముగా నీపైననే ఆలోచనలు నిలిపే నేర్పరితనము కలుగుతుందయ్యా ? 🙏 ఈ భూమిపైన మాకు ఇన్నిన్ని సౌఖ్యాలు అందుబాటులో ఉండగా , అవియే మా మేనిపై పెను భారములై ,వాటిని పొందాలి అను కాంక్ష రేగి , అనేకమైన పనులకు సన్నద్ధులమై ఉంటాముగానీ , నీమీద తలపెక్కడిది !🙏 ఇవియన్నీ మాకు వద్దు ప్రభూ ! ఈ భూమిపైన వీటన్నిటినీ జయించుట మావల్ల ఎన్నటికీ అయ్యే పని మాత్రము కాదు ! 🙏 సమర్ధుడవైన ఓ శ్రీ వేంకటేశ్వరా నీవే పెద్దమనసు చేసుకుని మా అశక్తతను గ్రహించి మమ్ములను ఈ మాయామోహములనుండీ రక్షించి కాపాడుము .🙏 ఇదియే నీవు మాకు చేసే గొప్పనైన సహాయమై ఉండును ! 🙏 🌹🙏🌹 ఓమ్ శ్రీ అలమేలుమంగా సమేత శ్రీ వేంకటేశ్వర స్వామినే నమః !🙏 తాత్పర్య సహిత దృశ్య మాలికగా మీకు అందించాలన్న నా చిన్న ప్రయత్నమును ఆశీర్వదిస్తారని ఆశిస్తూ..🙏 దోషములున్న...మన్నించమని విన్నపము... 🙏 ( అన్నమయ్య అక్షర వేదం --- సంపుటి 482) ✍ -- వేణుగోపాల్ యెల్లేపెద్ది 🙏

  • @sandhyasreesahithyasangeet4822
    @sandhyasreesahithyasangeet4822Күн бұрын

    ధన్యవాదాలు 🙏🙏🙏🙏

  • @user-ts3ns8xe7f
    @user-ts3ns8xe7f2 күн бұрын

    0m nam0 venkatesaya Govinda Govinda

  • @vijayabharathialluri1023
    @vijayabharathialluri10232 күн бұрын

    Om Sri Mahalakshmi Devaiy Namaha🙏🙏🙏 Madhuramaina Sankeertana; ammavaarini Beautifulga; Chupisthu; Keerthana Bhavamunu; chakkani drusyamalikatho; chala Baga present chasaru; very nice, Padhyamu; abhinandanalu Madhuramga sungby Sri Nidhi Garu; ahobalana; Sri Venkatadri ; Sri Mahalakshmi, bless you🙏 Namo Annamayya🙏

  • @yvgannamayyaaksharavedam6942
    @yvgannamayyaaksharavedam69422 күн бұрын

    @@vijayabharathialluri1023 Amma Thank You

  • @vennapusasudharshanreddy5812
    @vennapusasudharshanreddy58122 күн бұрын

    జై శ్రీమన్నారాయణ గురువుగారు నమస్కారము 🙏 మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీ వేంకటేశ్వర స్వామి వారి మంగళా శాసనాలు మీకు ఎల్లవేళలా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను గురువుగారు 😊🎉🎉🎉🎉🙏💐

  • @yvgannamayyaaksharavedam6942
    @yvgannamayyaaksharavedam69422 күн бұрын

    ధన్యవాదములండి

  • @ramadevibatchu5118
    @ramadevibatchu51182 күн бұрын

    E roju Tirumala swamivaari kalyanam ki ee pata pettaru26 July

  • @yvgannamayyaaksharavedam6942
    @yvgannamayyaaksharavedam69422 күн бұрын

    ధన్యవాదములండి

  • @ramadevibatchu5118
    @ramadevibatchu51182 күн бұрын

    @@yvgannamayyaaksharavedam6942🙏🙏🙏🙏🙏

  • @yvgannamayyaaksharavedam6942
    @yvgannamayyaaksharavedam69422 күн бұрын

    NARASIMHA VAIBHAVAM -- 14 🌺☘ ------------☘🌺 ANNAMAYYA AKSHARA VEDAM EPISODE - 481 ( ETUVANTI MOHAMO EEPEKU .. ) 🌺☘ ------------☘🌺 PREFACE :-- 🌹👇 Annamayya is Expressing his amazement by looking at Sri Mahalakshmi Who is fearlessly showering her Love and flirting romantically with The Lord Narasimha with her witty gestures and talks ! 🙏 Here goes the interesting keertana as below 👇 🌺☘ ------------☘🌺 Wow ! What A Great Fascination And Love She Has Upon Him !!🙏 Both Of Them Are Finding Prettiest Celebrations By Being Together Merrily !🙏 🌹🌹 She Sat With All Nearness To Him Making Themselves As The Right Couple ! She is Showing Great Intimacy With Him , With Sweat Drops Showering All Over Her Body , She Is Swinging In Joy With His Embraces ! Offering Her Lips To The Lord , With A Betel Nut Pan and Praising His Love , She Has Accepted Her Bonding With Him ! This Mahalakshmi Is Also Gibing Wittily With The Bestower Of Prahlada ( The Lord Narasimha )🙏 🌹🌹 She Is Smiling At Him And Bowing ! She Is Conversing All Lovely Talks With Him By Knowing The Truth Of Her Existence She Is Rejoicing Within Being United With Him Alone !🙏 By Uniting Her Cheek With His Cheek She Is Glowing In Tingling Joy ! By Holding The Lord Narasimha Always , Here She Is ! The Lotus Seated MahaLakshmi !!🙏 🌹🌹 She is Showing Lovely Gestures With Her Eyes She Could Gain All The Love And Romance From the Lord Attaining Contentment !🙏 By Making Her Divine Marks Of Existence At Ahobalam And Also On The Sacred Tirumala Hills She Is Pleasantly Blooming On The Heart Of The Lion Faced Lord Narasimha🙏 🌹🙏🌹 Om Sri Laksmi Nrusimha Mama Dehi Karaavalambam !🙏 Om Sri Alamelumnga Sametha Sri Venkateswara Swaminey Namaha !🙏 🌹🙏🌹 ✍ --Venu Gopal

  • @yvgannamayyaaksharavedam6942
    @yvgannamayyaaksharavedam69422 күн бұрын

    NARASIMHA VAIBHAVAM -- 14 🌺🍃 ------------🍃🌺 అన్నమయ్య అక్షరవేదం ..సంపుటి -- 481 ( ఎటువంటి మోహమో యీపెకు నాతని మీద .. ) 🌺🍃 ----------- 🍃🌺 ఓం నమో వేంకటేశాయ. 🙏 అన్నమయ్య అక్షర వేదం ..సంపుటి -- 481 కి శుభ స్వాగతం ..🙏 ప్రార్థన ః--🌹🙏 ఏమా ప్రేమము, చనువులు! సామీ నీతోడ నాడె సరసములెన్నో ! యీ ముదిత భాగ్యమొహొహో, తా మదనుని తల్లిగాన దనకే యొప్పెన్ ! 🌹🙏🌹 ✍ --స్వీయపద్యము ( కందము ) 🌹🌹 గంభీరముగా ఉన్న ఓ శ్రీ నారసింహా నీ వద్దనే ఎంతో చనువుగా తన ప్రేమములను ఒలికించుచున్నది . నీతో ఎన్నెన్ని సరసములాడుచున్నదో ఈ శ్రీ మహాలక్ష్మి !🙏 అసలు ఈ వనిత భగ్యము , ఆహా ఓహో !! అని అబ్బురపరుచుచున్నది ! 🙏 అవునులే శృంగారకళలన్నీ నేర్చిన ఆ మన్మథునికే తల్లి కదా ఈమె ! అందువల్లనే ఇంతటి చనవు నీతో ఈమెకే చెల్లినది ! 🙏 అట్టి మా మహలక్ష్మికీ , నీకూ సదా మంగళములు నృసింహా !! 🙏 🌹🌹 🌺🍃 -----------🍃🌺 మున్నుడి ః-- 🌹👇 శ్రీ నారసింహుని వద్ద తన ప్రేమమును పంచుచూ , ఆతనితో సరసములాడుచూ , అతనిని శృంగారమున తేలియాడునట్లు చేయుచూ , తాను కూడా ఆనందపడుతున్న శ్రీమహాలక్ష్మి చతురతలకు అబ్బురపడుచూ ఆమెను వర్ణిస్తున్నారు అన్నమ్మయ్య .🙏 మరి ఆ చక్కని సంకీర్తన అర్థము తెలుసుకుని పాడుకుందామా !👇 🌺🍃 ----------- 🍃🌺 🌹🌹 ఆహా ఎంతటి ప్రేమను పెంచుకుని ఉన్నదో ఈమె ఆతనిపై . అనువుగా వినోదములన్నీ చక్కగా ఏర్పడి ఉన్నవి వీరికొరకే అన్నట్లుగా ! 🙏 ఆమె ఆనందముతో చేయుచున్నవన్నీ ఆతనికి ఉత్సాహమును పంచుచున్నవి !🙏 🌹🌹 అతిసమీపముగా అతనిని చేరి జతగా కూర్చుని ఉన్నది , అతనితో చక్కగా చనువుగా ఉన్నది , అతని స్నేహమును అందుకుని . తన మేనెల్లా చెమటలు పడుతుండగా తన్మయత్వమున ఊగుచున్నది . ఎంగిలి పెదవులు అని కూడా చూడకుండా , పొత్తుకలుపుకొనుటకు తన తాంబూలమును ఆతనికి అందించినది అతనితో బంధుత్వమునకు సిద్ధపడి . అతనిని పొగుడుచున్నది . అలాగే మరికొంతసేపు దెప్పుచున్నది సరసముగా . ఈ విధముగా మహాలక్ష్మి ప్రహ్లాదవరదుడైన నారసింహునితో మిక్కిలి స్నేహముతో ఉన్నది !🙏 🌹🌹 అతనికి నమస్కారములు చేయుచూ చక్కని దరహాసముతో ఉన్నది . అతనికి ఎన్నెన్నో తీయనైన కబుర్లు చెప్పుచున్నది . తన ఉనికిని ఎరిగి సంతసపడుచూ లోలోపల సరొపోల్చుకుంటూ అమితానందమున ఉన్నది . తన చెక్కిలిని ఆతని చెక్కిలిపై జతచేసి , ఆ పులకింతల ఆనందములో మెరిసిపోవుచున్నది ! ఆతనిని ఎల్లప్పుడూ పట్టుకుని ఉంటూనే తన సరసములను సాగించుచున్నది , కమలాసనియైన మహాలక్ష్మి శ్రీ నరసింహునితో !🙏 🌹🌹 తన కళ్లతోనే సైగలు చేస్తూ బాసలు చెప్పుచున్నది ఆతనితో . ఆతని కౌగిలిలో నిండారా మునిగిపోయినది ! తనివితీరా అతనితో శృంగార సౌఖ్యతలను అందుకున్నది . ఇదిగో తన గుర్తుగా ఆ అహోబలము యందు , ఇక్కడ ఈ వేంకటాచలమునందు , గట్టిగా అదుముకుని వేంకటేశ్వరుని హ్రదయమునందు, నారసింహుని తొడపైన కొలువై వికసించుచూ యున్నది ఈ శ్రీ మహాలక్ష్మి !🙏 🌹🙏🌹 ఓమ్ శ్రీ అలమేలుమంగా సమేత శ్రీ వేంకటేశ్వర స్వామినే నమః !🙏 తాత్పర్య సహిత దృశ్య మాలికగా మీకు అందించాలన్న నా చిన్న ప్రయత్నమును ఆశీర్వదిస్తారని ఆశిస్తూ..🙏 దోషములున్న...మన్నించమని విన్నపము... 🙏 ( అన్నమయ్య అక్షర వేదం --- సంపుటి 481) ✍ -- వేణుగోపాల్ యెల్లేపెద్ది 🙏 🌹🌹 సంకీర్తన 🌹🌹 ॥పల్లవి॥ ఎటువంటి మోహమో యీపెకు నాతని మీఁద ఘటియించె నిద్దరికి కందువ వేడుకలు ॥చ1॥ సంగడిఁ గూచున్నది చనవు చేకొన్నది అంగపుఁ జెమట నోల లాడినది యెంగిలిపొత్తున విడే లిచ్చినది మెచ్చినది పంగించీ నిందిరాదేవి ప్రహ్లాదవరదుని ॥చ2॥ మొక్కుచు నవ్వినది ముచ్చట లాడినది యిక్కువ లంటుచు లోలో నెన సున్నది చెక్కుఁ జెక్కుఁ గదియించి జిగిఁ బులకించినది చిక్కించీఁ గమలాదేవి శ్రీనరసింహునిని ॥చ3॥ కనుసన్న చేసినది కాఁగిట నించినది తనివార రతులను దక్కఁ గొన్నది చెనకి యహోబలాన శ్రీవెంకటాద్రి మీఁద ననిచె శ్రీమహాలక్ష్మీ నరమృగదేవుని 🌹🙏🌹🙏🌹

  • @suryakumarianappindi9968
    @suryakumarianappindi99682 күн бұрын

    ఈ కీర్తన వింటూ ఉంటే కన్నీళ్లు ఆగవు ధరపాతం గా వస్తూనే ఉంటాయి ఇది జీవాత్మ పరమాత్మ వియోగమే అనుకుంటాను

  • @yvgannamayyaaksharavedam6942
    @yvgannamayyaaksharavedam69422 күн бұрын

    అవునండి ఇది ఓక జీవాత్మ స్వామి సన్నిధిని మాత్రమే కోరుకుని అతని ఎడబాటును భరించలేని భావావేదన . మీరు చక్క్గగా సారమును గ్రహించారు ధన్యులు మీరు . నమస్సులు మీకు !

  • @suryakumarianappindi9968
    @suryakumarianappindi99682 күн бұрын

    @@yvgannamayyaaksharavedam6942 🙏🙏🙏

  • @ramaraoayithy9472
    @ramaraoayithy94723 күн бұрын

    Om namo narayana govinda

  • @vijayabharathialluri1023
    @vijayabharathialluri10233 күн бұрын

    Om Sri Narasimhaya Namaha🙏🙏🙏 swamy Varini pendli Koduku;ga very beautifulga verninchina; Adbhutamaina Sankeertana; excellent presentation of Keerthana with beautiful own padhyamu; yadadri with beautiful drusyamalika; and bhaavaartham vivarana; Sri Venugopal Garu Abhinandanalu Maduramaina sung by vydehi Chaitanya Garu; Sri Venkatadri prahladavaradudu Sri Lakshmi Narasimha swamy bless you🙏

  • @yvgannamayyaaksharavedam6942
    @yvgannamayyaaksharavedam69424 күн бұрын

    NARASIMHA VAIBHAVAM -- 13 🌺☘ ------------☘🌺 ANNAMAYYA AKSHARA VEDAM EPISODE -- 480 ( SEVINCHARO MOKKARO ) 🌺☘ ------------☘🌺 PREFACE :--🌹👇 Annamacharya is seeing The Lord Sri Narasimha as a bridegroom in this keertana.🙏 Annamayya says that Swami as a new bridegroom , along with Goddess Lakshmi, is close to us as a person of joy and happiness, and this is the right time to serve him!🙏 Here goes the interesting keertana as below .👇 🌺☘ ------------☘🌺 🌹🌹 Be At His Service ! Pay Your Salutations ! Oh My Dear Fellowmen And Devotees !🙏 He Is At Our Hand Reach Pleasantly Showering All His Mercy Upon Us !🙏 🌹🌹 Adorned With A Wedding Chaplet On The Forehead , Upon A Golden Throne, Look There ! He Is Seated Grandly Along With Sri Mahalakshmi🙏 While Holy Ladies Adorned With Forehead Ornaments Singing His Wedding Songs , He Is Splendidly Shining With All Aptness The Bestower Of Prahlada ( Lord Narasimha )🙏 🌹🌹 While The Holy Seers Chanting Wedding Hymns , Wearing The Sacred Wedding Bracelet On His Wrist , He Is Laughing In Great Joy Mingling With Indira ( Mahalakshmi ) 🙏 Incessantly While The Holy Ladies Waving Camphor Lights At Him For All Auspiciousness, Dutifully Inclined With Mercy This Lord Narasimha Is Showering Boons To All🙏 🌹🌹 While The Ladies Are Serving A Sumptuous Meal , He Is Seated Nicely For The Wedding Feast , He Is Having Romantic Talks Rejoicing With Mahalakshmi🙏 Delightfully On This Venkadri Hill , And Widely Spread Where Ever We See , He Is Present As The Lord Of Supreme Strength , The Bestower Of Prahlada ( Lord Narasimha )🙏 🌹🙏🌹 Sri Lakshmi Nrusimha Mamadehi Karaavalambam !🙏 Om Sri Alamelumanga Sametha Sri Venkateswara Swaminey Namaha !🙏 ✍ -- VenuGopal

  • @yvgannamayyaaksharavedam6942
    @yvgannamayyaaksharavedam69424 күн бұрын

    NARASIMHA VAIBHAVAM -- 13 🌺🍃 ------------🍃🌺 అన్నమయ్య అక్షరవేదం ..సంపుటి -- 480 ( సేవించరో మొక్కరో చెలులాల నరులాల .. ) 🌺🍃 ----------- 🍃🌺 ఓం నమో వేంకటేశాయ. 🙏 అన్నమయ్య అక్షర వేదం ..సంపుటి -- 480 కి శుభ స్వాగతం ..🙏 ప్రార్థన ః--🌹🙏 మనువాడగ లకిమమ్మను ఘనుడు నృసింహుడదె చేతి కంకణములతో కనకపు బాసిక మలరగ , మునుచూడని సొగసుతోడ ముద్దుగనుండెన్! 🌹🙏🌹 ✍ --స్వీయపద్యము ( కందము ) 🌹🌹 ఈ గొప్పవాడైన నారసింహుడు మా లక్ష్మమ్మను పెండ్లియాడుటకు , కొత్త పెళ్ళికొడుకుగా చేతికి కంకణాలు , నుదుటన బంగారు బాసికమునూ ధరించి వేంచేయుట చూస్తుంటే , ఇంతకుముందు ఎన్నడూ చూడని అందముతో భలే ముద్దుగా ఉన్నాడు !🙏 అట్టి మా నారసింహునకూ , అతడు మనువాడే మహలక్ష్మికీ మంగళములు !🙏 🌹🌹 🌺🍃 -----------🍃🌺 మున్నుడి ః-- 🌹👇 అన్నమాచార్యుల వారు శ్రీ నారసింహుడిని పెండ్లికొడుకుగా దర్శించుకున్నారు ఈ కీర్తనలో .🙏 నూత్న వరుడుగా స్వామి , లక్ష్మీ దేవిని మనువాడే ఉత్సాహియై , ప్రసన్నవదనునిగా మన చేరువనే ఉన్నాడని , అతనిని సేవించుకొనుటకు ఇదియే సరియైన సమయమని తెలుపుచున్నారు అన్నమయ్య !🙏 మరి ఆ చక్కని సంకీర్తన అర్థము తెలుసుకుని పాడుకుందామా !👇 🌺🍃 ----------- 🍃🌺 🌹🌹 ఓ స్నేహితులారా , నా తోటి భక్తజనులారా , రండి అతనిని సేవించుకుందాము . అతనిని ప్రార్ధించి నమస్కరించుకుందాము .🙏 మనకు చేతికందెడి దగ్గరగా వచ్చియున్నాడు , కరుణను అమితముగా గుప్పించగలిగే నారసింహుడు , 🙏 🌹🌹 నుదుటన మెరిసిపోయే బాసికమును కట్టుకుని, అదిగో బంగారు పీఠముపై , వైభవముగా కూర్చుని ఉన్నాడు లక్ష్మీదేవితో కూడి . పెండ్లికొడుకుగా కొలువై ఉన్నాడు అదిగో .🙏 నుదుటన మాంగళ్యచిహ్నములైన ఆభరణములను ధరించిన స్త్రీలు పెండ్లి పాటలు పాడుచుండగా , గొప్ప తేజముతో సరియైన రీతిలో అందముగా ప్రకాశిస్తున్నాడు ప్రహ్లాదవరదుడైన నారసింహుడు !🙏 🌹🌹 అదిగో మునిపుంగవులు కళ్యాణ మంత్రములను పఠిస్తుండగా , తన ముంజేతికి కంకణము కట్టించుకుని , అందముగా వికసించిన మోమున చక్కగా నవ్వులు నవ్వుచున్నాడు లక్ష్మీదేవిని చూచుచూ .🙏 సతతము సుమంగళులైన స్త్రీలు హారతులను ఎత్తి నీరాజనములను ఇస్తుండగా , తనకుతానె ఇఛ్చవహించి కోరినవారికి కోరిన వరముల నొసగుచున్నాడు ప్రహ్లాదవరదుడైన శ్రీ నారసింహుడు .🙏 🌹🌹 చక్కగా వనితలు వివాహవిందుగా ఎన్నెన్నొ భక్ష్యములను ప్రేమగా వడ్డిస్తుండగా , బువ్వకు కూర్చుని , లక్ఢ్మీదేవితో సరసములాడుచూ , ఆరగిస్తున్నాడు నారసింహుడు .🙏 ఉత్సాహముగా సంతోషముతో ఈ వేంకటాద్రిపై ఈతడే , అంతటాను ఈతడే , ఏవిధముగా చూచినా మిక్కిలి బలముగలవాడై , ఉన్నాడు ప్రహ్లాదవరదుడైన నారసింహుడు .🙏 🌹🙏🌹 ఓమ్ శ్రీ అలమేలుమంగా సమేత శ్రీ వేంకటేశ్వర స్వామినే నమః !🙏 తాత్పర్య సహిత దృశ్య మాలికగా మీకు అందించాలన్న నా చిన్న ప్రయత్నమును ఆశీర్వదిస్తారని ఆశిస్తూ..🙏 దోషములున్న...మన్నించమని విన్నపము... 🙏 ( అన్నమయ్య అక్షర వేదం --- సంపుటి 480) ✍ -- వేణుగోపాల్ యెల్లేపెద్ది 🙏 🌹🌹 సంకీర్తన 🌹🌹 ॥పల్లవి॥ సేవించరో మొక్కరో చెలులాల నరులాల కైవశమై వున్నవాఁడు కరుణాకరుండు ॥చ1॥ బాసికము గట్టుకొని బంగారుగద్దెమీఁద లాసి కూచున్నాఁడదివో లకిమమ్మతో సూసకపువనితలు సోబానఁ బాడఁగాను భాసురమై యొప్పె నదె ప్రహ్లదవరదుఁడు ॥చ2॥ మునులు చదువఁగాను ముంజేతికంకణాలతో యెనసి నవ్వులు నవ్వీ నిందిరతో అనయముఁ బేరఁటాండ్లారతులెత్తఁగాను పనివూని వరాలిచ్చీఁ బ్రహ్లదవరదుఁడు ॥చ3॥ పొలఁతులు వడ్డించఁగా బువ్వానఁ గూచుండి చెలఁగి సరసమాడీ శ్రీదేవితో యెలమి శ్రీవేంకటాద్రి నీతఁడే యెందుచూచినా బలవంతుఁడై వున్నాఁడు ప్రహ్లదవరదుఁడు 🌹🙏🌹🙏🌹

  • @user-ts3ns8xe7f
    @user-ts3ns8xe7f4 күн бұрын

    Om namo venkatesaya Govinda Govinda

  • @ramaraoayithy9472
    @ramaraoayithy94725 күн бұрын

    Om namo narayana govind

  • @user-ts3ns8xe7f
    @user-ts3ns8xe7f6 күн бұрын

    Om namo venkatesaya Govinda l

  • @mudavathmanasa8113
    @mudavathmanasa81136 күн бұрын

    ఇవి వింటుంటే కళ్ళు చేమగిలుతున్నాయి

  • @padmaiyengar5387
    @padmaiyengar53876 күн бұрын

    🙏🙏🙏

  • @ramaraoayithy9472
    @ramaraoayithy94727 күн бұрын

    Om namo narayana govinda govinda Sri matha sri

  • @user-ts3ns8xe7f
    @user-ts3ns8xe7f8 күн бұрын

    Om namo venkatesaya Govinda Govinda

  • @vijayabharathialluri1023
    @vijayabharathialluri10238 күн бұрын

    Om Sri Hariya Namaha🙏🙏🙏 Hari Bhakti; Goppatanamunu Keerthinchina Super Sankeertana; Sri Venugopal Garu; Adbhutamaina; Bhavamunu; Thagina wonderful Drusyamulatho; very beautifulga present chesaru; thank you so much; very nice, own padhyamu abhinandanalu; excellently Sungby Anirudh Garu; Sri Hari Srihari Srihari🙏🙏🙏 Sri Venkatadri Srihari bless you🙏🙏🙏

  • @padmajasingaraju862
    @padmajasingaraju8628 күн бұрын

    👌🏼🙏🙏

  • @sridevigona7954
    @sridevigona79548 күн бұрын

    Adbhutamaina..keerthana...great voice...vinte manushula ke kadu animals birds ki kuda bhakti untundi Ani ashara gyanam ayindi.

  • @AnnamayyaKalaSamithiNakrekal
    @AnnamayyaKalaSamithiNakrekal8 күн бұрын

    అద్భుతమైన కీర్తనలు వినే భాగ్యం కల్పించి నేను నేర్చుకుంటూ నా పిల్లలకు నేర్పించే అవకాశం కల్పించే మీకు సదా కృతజ్ఞతలు సార్ 🙏🙏

  • @yvgannamayyaaksharavedam6942
    @yvgannamayyaaksharavedam69428 күн бұрын

    🌹🌹 సంకీర్తన 🌹🌹 ॥పల్లవి॥ హరిభక్తి గలిగితే అన్నియు ముఖ్యము గాక విరసాచారము లెల్ల వృథావృథా ॥చ1॥ మిక్కిలి నీట మునిఁగే మీను కది స్నానమా కొక్కెరధ్యానము సేసుకొరే అది యోగమా నిక్కి మేక ఆకు మేయు నిండ నదే తపమా చిక్కి తలకిందు వేలే జిబ్బడాయి సిద్ధుఁడా ॥చ2॥ పులులు గుహ నుంటే పోలింప ఋషులా యెలుపు గడ్డము వేచు నింతలోనే యోగ్యుఁడా యిలఁబక్షు లాకాశాన కేఁగితే దేవతలా వొలసి కోఁతి యడవి నుంటే వనవాసమా ॥చ3॥ మాకులు మాట లాడవు మౌనవ్రతములా కోక గట్టని బాలులు కోరి దిగంబరులా పై కొని శ్రీవేంకటేశు భక్తఁ డేమి సేసినాను చేకొని లోకములోని చెల్లుబడులే 🌹🙏🌹🙏🌹

  • @yvgannamayyaaksharavedam6942
    @yvgannamayyaaksharavedam69428 күн бұрын

    🌺🍃 *------------*🍃🌺 *అన్నమయ్య అక్షరవేదం ..సంపుటి -- 479* *( హరిభక్తి గలిగితే అన్నియు ముఖ్యము గాక .. )* 🌺🍃 *-----------* 🍃🌺 ఓం నమో వేంకటేశాయ. 🙏 అన్నమయ్య అక్షర వేదం ..సంపుటి -- 479 కి శుభ స్వాగతం ..🙏 *ప్రార్థన ః--*🌹🙏 *హరివిరసులై జపతపము* *గురుతర యజ్ఞంబుఁ జేయ కూడునె ఫలముల్ ?* *యరసి హరినె నమ్ముచు నీ* *కరములు జోడించు చాలు కైవల్యముకై !* 🌹🙏🌹 ✍️ *--స్వీయపద్యము ( కందము )* 🌹🌹 హరి మీద భక్తి అనే సారమైన రసమును ప్రక్కకు పెట్టి నేను ఎంత గొప్ప జపము గానీ తపము గానీ , చివరకు మిక్కిలి గొప్పనైన యజ్ఞము చేసినా ఏమి ఫలములను పొందగలను ? 🙏 విచారించి తెలుసుకుని , ఆ శ్రీహరిపైననే నా మనసంతా లగ్నము చేసి నా చేతులు పైకి ఎత్తి జోడించి సంపూర్ణ శరణాగతితో ఒక్క నమస్కారము చేయగలిగితే అదియే నాకు కైవల్యప్రాప్తికి దోహదపడును కదా ! 🙏 స్వామీ ! నిన్నే నమ్మియుండే అట్టి మనసును నాకు ప్రసాదించుము !🙏 🌹🌹 🌺🍃 *-----------*🍃🌺 *మున్నుడి ః--* 🌹👇 అన్నమాచార్యులవారి కూమారుడైన *పెదతిరుమలాచార్యుల* వారు కూడా *శ్రీ వేంకటేశ్వరునిపై* అనన్యమైన భక్తితో అనేక ప్రబోధాత్మక సంకీర్తనలను రచించారు .🙏 హరిపై భక్తిని ప్రధాన రసముగా ఉంచక చేసే ఎంతటి గొప్పపనులైనా అవి వృథయే అని అంటున్నారు . కేవలము ఆ చేతలు ఆర్భాటానికో , సహజ నైజము వల్లనో చేసినంత మాత్రాన పెద్ద ఫలము చేకూరదు .🙏 ఆ చేత ఎప్పుడు గొప్పదగును ? అది హరి భక్తితో నిండి యున్ననాడే అని అంటున్నారు పెదతిరుమలయ్య !🙏 మరి ఆ చక్కని సంకీర్తన అర్థము తెలుసుకుని పాడుకుందామా !👇 🌺🍃 *-----------* 🍃🌺 🌹🌹 ఈ సదాచారములు , సత్కార్యములు ఇవి అన్నీ పరమాత్ముడైన *శ్రీహరి పై భక్తి* అనే రసముతో అంతర్లీనముగా ముడిపడియుండితేనే అవి శ్రేష్టమైనవి అవుతాయి .🙏 ముఖ్యమైనవి చేయ తగినవీ అవుతాయి కానీ , ఆ హరిపై భక్తిని విడనాడి చేసిన ఎంతటి గొప్ప కార్యమైనా వ్యర్థమే ! వ్యర్థమే !!🙏 🌹🌹 ఎల్లప్పుడూ తన సహజగుణ స్వభావము చేత నీటిలోనే మునిగి ఉండే చేపకు , అది పుణ్యస్నానమగునా ? తీర్థ జలములలో మునిగిన ఫలితము వచ్చునా ?🙏 కదలకుండా తదేకముగా ఒక్క కాలుతో నిలుచుని ఉండే కొంగకు, తన ఆహారము దొరుకునేమో గానీ , యోగ సిద్ధిని ఏమన్నా పొందగలదా ? 🙏 దినదినమూ కేవలము ఆకులనే మేసెడి మేకకు అది తన స్వాభావిక ఆహారమే గానీ , రుచులను త్యజించిన తపము చేసినదని అనుకొనగలమా ?🙏 ఒక చెట్టు కొమ్మకు చిక్కి తలక్రిందులుగా వ్రేలాడగలిగినంత మాత్రాన ,అది ఏమన్నా సిద్ధులను సాధించినట్టా ? దానిని సిద్ధుడని అంటామా ?🙏 🌹🌹 పులుల సహజ ఆవాసమే గుహలు . అవి గుహలలో ఉన్నాయని వాటిని , ఋషులతో పోల్చము కదా !🙏 ఎలుగుబంటికి కూడా గడ్డము ఉంటుంది , అంత మాత్రమున అది యోగసాధనలో మునిగిపోయి దేహవాంఛలేని స్థితిలో దాని గడ్డము పెరిగినది అని అనుకుంటామా ? దానిని యోగి అని అంటామా ?🙏 నేలపై పుట్టిన పక్షలు పైనున్న ఆకాశమునకు ఎగరగలిగినంత మాత్రాన అవి దేవతలని గౌరవస్థానమును దక్కించుకున్నవా ?🙏 అడవులలోనే వ్యాపించి తిరుగు కోతిని , వానప్రస్థాశ్రమును స్వీకరించిన త్యాగిగా గుర్తిస్తున్నామా ? 🙏 🌹🌹 బాగుగా పెరిగినా సరే చెట్లు మాట్లాడలేవు . అంత మాత్రాన అవి మౌనవ్రతమును చేపెట్టిన దీక్షగల గుణము ఉన్నవి అని పరిగణిస్తున్నామా ?🙏 అసలు బట్టలేమీ వేసుకోకుండా హాయిగా చంటిపిల్లలు ఆడుకుంటారు చీకు చింతలు లేకుండా ! అంత మాత్రమున వారిని దిగంబర సన్యాసులని అంటామా !🙏 ఈ విధముగానే నిజానికి పరమాత్మునిపై భక్తి అన్న ప్రధాన సారవంతమైన గుణము లేకుండా మనము చేసే ఏ ఘనకార్యమైనా సాధారణమై పోవును గానీ దానికి ఎటువంటి ప్రత్యేకత సమ్మతి ఉండదు .🙏 కానీ ఇదిగో ఈ *శ్రీవేంకటేశ్వరునిపై* అచంచలమైన విశ్వాసముతో కూడిన అసమానమైన భక్తిపరాయణులకు మాత్రము వారు ఏమి చేసినా చెల్లుబాటే అవుతుంది . దానిని లోకము ఆమోదించి అనుసరిస్తూ ఉంటుంది కూడా !🙏 🌹🙏🌹 *ఓమ్ శ్రీ అలమేలుమంగా సమేత శ్రీ వేంకటేశ్వర స్వామినే నమః !*🙏 తాత్పర్య సహిత దృశ్య మాలికగా మీకు అందించాలన్న నా చిన్న ప్రయత్నమును ఆశీర్వదిస్తారని ఆశిస్తూ..🙏 దోషములున్న...మన్నించమని విన్నపము... 🙏 ( అన్నమయ్య అక్షర వేదం --- సంపుటి 479) ✍️ *-- వేణుగోపాల్ యెల్లేపెద్ది* 🙏

  • @ramaraoayithy9472
    @ramaraoayithy94729 күн бұрын

    Om namo narayana govinda govinda

  • @vijayabharathialluri1023
    @vijayabharathialluri10239 күн бұрын

    Om Sri Alamelumanga Devaiy Namaha🙏🙏🙏 Ammanu Wonderfulga; verninchi; keerthinchina Sankeertana; Sri Venugopal Garu; Amma Darshanam, chakkaga chayisthu Beautiful Drusyamulatho; excellent Bhaavartha vivarana tho present chesinandhuku Abhinandanalu; Adbhutamaina Gaanamu; Namo Annamayya🙏🙏🙏🙏 Om Sri Alamelu Manga Venkateswara Swamy bless you🙏🙏🙏

  • @yvgannamayyaaksharavedam6942
    @yvgannamayyaaksharavedam69429 күн бұрын

    thank you so much amma

  • @yvgannamayyaaksharavedam6942
    @yvgannamayyaaksharavedam69429 күн бұрын

    🌺☘ ------------☘🌺 ANNAMAYYA AKSHARA VEDAM EPISODE - 478 ( ENTHA JAANARO EE KALIKI .. ) 🌺☘ ------------☘🌺 PREFACE :--🌹👇 Annamacharya wrote this keertana in his wonderful poetic style as a romantic song! He is amazed at the cleverness of Mother Alamelumangamma and he is describing it all with The Lord . As “ Oh Lord , see how much she is amusing you, and also enjoying entertaining herself “🙏 Are those entertainments ordinary entertainments? No Not at all ! playing in the cold rain showers is one thing, Mountaineering is another fun.🙏 Sporting In The Garden woods is one Entertainment, the joy of spring flower showers is another, 🙏 The joy of a sumptuous dinner is again another Oh Lord With Such Great Amusements She is giving You The Joy as if You Are newly wedded at every instance !🙏 Here goes the interesting keertana as below !👇 🌺☘ ------------☘🌺 🌹🌹 Wow ! What A Great Genius Lady She Is !! Oh Lord ! She Alone Is Aptly Deserved To Be Posessed By You And For Your Enjoyment !🙏 🌹🌹 Being In Tight Embraces With You This Lady Is Showering Sweat , Making You Cool And It Is Like Water sporting For You Oh Lord !🙏 Gratifying You Greatly She is Pressing Her Big Bosoms Upon You , Thus This Lady Is Making You Delightful With The Sporting Of Mountaineering !🙏 🌹🌹 By Increasingly Spreading All Over You With Her Extending Hands , She Is Giving The Delight Of A Pleasure Garden !🙏 By Hesitatingly Looking At You With Lot Of Shy And Love , She Is Making You Joyful as if Sporting In An Underwood at Spring , Showering With Pretty Flowers !🙏 🌹🌹 Her Honey Filled Lips Are The Rarest Of The Rare ! With Those Lips She Aptly Gave You The Joy Of a Sumptuous Feast !🙏 By Dedicating Everything To You And Melting Down For You! Oh Lord Sri Venkateswara She Has Spreaded All Her Romance & Love Sports And Delighting You Every Day As A Wedding Day !🙏 🌹🙏🌹 Om Sri Alamelumanga Sametha Sri Venkateswara Swaminey Namaha ! 🌹🙏🌹 ✍ -- Venu Gopal

  • @yvgannamayyaaksharavedam6942
    @yvgannamayyaaksharavedam69429 күн бұрын

    🌺🍃 ------------🍃🌺 అన్నమయ్య అక్షరవేదం ..సంపుటి -- 478 ( యెంత జాణరో యీ కలికి .. ) 🌺🍃 ----------- 🍃🌺 ఓం నమో వేంకటేశాయ. 🙏 అన్నమయ్య అక్షర వేదం ..సంపుటి -- 478 కి శుభ స్వాగతం ..🙏 ప్రార్థన ః--🌹🙏 నేరుపు రతులను , నీవవి కోరక కొసరకనె తానె, గుప్పించెనయా చేరి యలమేలుమంగయె ! యేరాశి ఫలంబొ నీది యిందిరనాథా !! 🌹🙏🌹 ✍ --స్వీయపద్యము ( కందము ) 🌹🌹 మిక్కిలి గొప్పనైన సంతోషములనన్నీ , నీవు కోరక పోయినా , ఇంకా కావాలని కొసరక పోయినా , తనంతట తానుగానే , నిన్ను చేరి నీకు అన్ని సుఖములనూ అందించుచున్నదయ్యా , నెరజాణ అయిన మా అలమేలుమంగమ్మ !🙏 ఆహా ! ఇంతటి సొఖ్యతలు నీకు ఇట్టే అమరిపోవుట చూస్తుంటే ఇది ఏ రాశిఫలమో అని ఆశ్చర్యముగా ఉన్నది ఓ లక్ష్మీ వల్లభా !! 🙏 అట్టి మీ ఇద్దరికీ శుభమంగళములు సదా !!🙏 🌺🍃 -----------🍃🌺 మున్నుడి ః-- 🌹👇 అన్నమాచార్యుల వారు అద్భుతమైన తన కవితాశైలిలో శృంగార రచనగా చేసిన కీర్తన ఇది ! అలమేలుమంగమ్మ చతురతలకు విస్తుపోతూ స్వామికి విన్నవిస్తున్నారు .🙏 స్వామీ ఈమె నీకు ఎన్నెన్ని వినోదాలను కలిగించుచూ , తాను కూడా వినోదిస్తూ ఆనందపడుచున్నదో ! 🙏 ఆ వినోదాలు మామూలు వినోదాలా , వర్షపు జల్లులలో చల్లగా ఆటలాడెడిది ఒకటైతే , పర్వతారోహణ వినోదము ఇంకొకటి . వన విహార వినోదము, వసంతపు పూలజల్లుల ఆనందము ఒకటైతే , విందు భోజనపు ఆనందము ఇంకొకటి .🙏 ఇలా ఎన్నో ఆనందాలను కలుగచేస్తూ నీకు నిత్య కళ్యాణ భోగమును ఇచ్చుచున్నదయ్యా అని చక్కగా అవి ఏమేమిటో వర్ణిస్తున్నారు ! 🙏 మరి ఆ చక్కని శృంగార సంకీర్తన అర్థము తెలుసుకుని పాడుకుందామా ! 🌺🍃 ----------- 🍃🌺 🌹🌹 ఆహా !! ఎంతటి చతురురాలు ఈ మనోజ్ఞురాలైన యింతి ! 🙏 స్వామీ ! నీ సౌఖ్యతలకు ఈమెయే తగునైన జవరాలు !!🙏 🌹🌹 ఈ చెలియ నీ బిగుతైన కౌగిళ్లలో , అధికముగా చెమటలను చిందిస్తూ , చల్లగా నిన్ను జలక్రీడలలో వినోదింప చేస్తున్నది .🙏 తన ఘనమైన స్తనద్వయమును ,నీ ఛాతిపై మాటిమాటికీ ముద్దుగా అదుముచూ , పర్వతారోహణ వినోదాన్ని కలుగచేస్తున్నది !🙏 🌹🌹 నీపై పెనవేసుకుంటూ తన భుజములను చేతులను చాచి , లతలవలె నిన్ను అవి అల్లుకొనగా , వనవిహారపు వినీదమును అందజేయుచున్నది .🙏 తన చూపులను , నీపై నేరుగా చూడలేని అవస్థలో , సిగ్గులతో నీపై ఒలకబోయుచు , వసంతము లో పూలజల్లుల యందు విహారము చేయుచున్న ఆనందమును కలుగజేయుచున్నది ! 🙏 🌹🌹 అరుదులకే అరుదైన వంటివి ఈమె తేనెలొలుకు పెదవులు . వాటితో నీకు మంచి విందు భోజనపు ఆనందమునే ఇచ్చుచున్నది .🙏 ఇన్ని చతురతలతో మెరయుచున్న ఈ పడతి , సర్వస్వమూ నీకే అర్పించుకుని , నీలో కరిగిపోవుచున్న ఆనందములో ఉన్నదయ్యా ఓ శ్రీ వేంకటేశ్వరా ! తన శృంగారమునంతా నీకోసమే పరచి , నీకు నిత్యకళ్యాణపు ఆనందమును కలుగచేస్తున్నదయ్యా ! 🙏 ఇక నీవు భోగించుటకు ఈమె తప్ప ఇంకెవరూ సరిరారు !🙏 🌹🙏🌹 ఓమ్ శ్రీ అలమేలుమంగా సమేత శ్రీ వేంకటేశ్వర స్వామినే నమః !🙏 తాత్పర్య సహిత దృశ్య మాలికగా మీకు అందించాలన్న నా చిన్న ప్రయత్నమును ఆశీర్వదిస్తారని ఆశిస్తూ..🙏 దోషములున్న...మన్నించమని విన్నపము... 🙏 ( అన్నమయ్య అక్షర వేదం --- సంపుటి 478) ✍ -- వేణుగోపాల్ యెల్లేపెద్ది 🙏 🌹🌹 సంకీర్తన 🌹🌹 ॥పల్లవి॥ యెంత జాణరో యీ కలికి కాంతుఁ డ నీ భోగములకే తగునూ ॥చ1॥ చెలి నీ కౌఁగిటిచెమటలఁ జేసెను చలువగ నిప్పుడు జల కేలి అలరుచుఁ గుచముల నదుముచుఁ జేసెను పలుమరు ముదములఁ బర్వతకేలి ॥చ2॥ పై పై బెనఁగుచు బాహులతలనే వైపుగఁ జేసెను వనకేలి చూపుల నీపయి సొలయుచుఁ జేసెను పూఁప వసంతము పూవులకేలి ॥చ3॥ అరుదుగ నట్టివి యధరామృతముల సరిఁ జేసెను భోజనకేలి కరఁగుచు శ్రీ వేంకటేశ సేసేను పరగిన రతులనె పరిణయకేలి. 🌹🙏🌹🙏🌹

  • @suryakumarianappindi9968
    @suryakumarianappindi99689 күн бұрын

    ఖరహారాప్రియ?

  • @suryakumarianappindi9968
    @suryakumarianappindi99684 күн бұрын

    You don’t answer for my question

  • @yvgannamayyaaksharavedam6942
    @yvgannamayyaaksharavedam69423 күн бұрын

    @@suryakumarianappindi9968 garu yes it is khara hara priya ragam sung by Smt Nallan Chakravartula Sridevi garu Composed By Her Brother nallan Chakravartula Lakshmanachary garu

  • @suryakumarianappindi9968
    @suryakumarianappindi99689 күн бұрын

    అద్భుతం రాగంప్లీజ్

  • @yvgannamayyaaksharavedam6942
    @yvgannamayyaaksharavedam69423 күн бұрын

    KHARA HARA PRIYA COMPOSED BY NC LAKSHMANA CHARY

  • @suryakumarianappindi9968
    @suryakumarianappindi99683 күн бұрын

    Thankyou🙏🙏🙏

  • @suryakumarianappindi9968
    @suryakumarianappindi99689 күн бұрын

    సర్ రాగం ప్లీజ్

  • @user-ts3ns8xe7f
    @user-ts3ns8xe7f10 күн бұрын

    0m namo venkatesaya Govinda Govinda

  • @vijayabharathialluri1023
    @vijayabharathialluri102310 күн бұрын

    Om Narasimha Namaha🙏🙏🙏 maddileti Laxmi Narasimha Swamini Keerthisthunna Beautiful Sankeertana; temple and swamyvaarini Chakkaga Chupinacharu; very nice Pradhana; thank you so much for presenting Keerthana with Thaparya Sahitha Drusyamalika Beautifully; abhinandanalu; excellently sungby Sai Charan Garu and Nikhita garu; Karuninchavayya Nannu Sri Venkatadri Kambhamu Raaya🙏🙏🙏

  • @yvgannamayyaaksharavedam6942
    @yvgannamayyaaksharavedam694210 күн бұрын

    NARASIMHA VAIBHAVAM - 12 🌺☘ ------------☘🌺 ANNAMAYYA AKSHARA VEDAM EPISODE - 477 ( KARUNICHAVAYYA MAMMU KAMBHAMURAYA ) 🌺☘ ------------☘🌺 PREFACE :-- 🌹👇 When ever Annamacharya visited Kurnool, Chittoor, Ananthapuram and Hampi vijayanagar, he wrote beautiful keertanas on the respective deities.🙏 These are very useful for our historians even today!🙏 Here in this kirtan he is writing in the pallavi as "Pere Devuni Kaluva Pedda Kambhapuraya" Kambhapurayadu means Narasimha. Now the question is Which Narasimha annamyya is mentioning here? “ Pere “ in telugu means reservoir . and ‘’ Kaaluva “ is a canal a small brook or stream of the reservoir. If we look at these carefully, we can understand that Annamacharya is glorifying Maddileti Lakshmi Narasimha Swamy.🙏 This Shrine Is on The Banks Of The Canal Of Maddileru Reservoir . Maddileti Narasimha Swamy Temple, Near Maddileru Canal , Bethamcherla Kurnool AP !🙏 Another feature of this kirtan is that it is presented as a Srungaara keertana .🙏 Annamayya describes the Lovely gestures of a woman ( Jeevanayika ) who has developed a deep love for Narasimha and pleads The Lord for to be merciful upon her by showering his Love.🙏 Here goes the interesting keertana as below !👇 🌺☘ ------------☘🌺 🌹🌹 Oh Lord Presiding At The Canal Of The Great Reservoir Maddileru ! Oh Lord Incarnated From The Pillar ,🙏 Do Show Mercy Upon us , Oh Lord Who Emerged From The Pillar !🙏 🌹🌹 Oh Lord Who Has A Loud Heartily Laughter , Look At The Prettiness of This Lady !🙏 Oh Lord On Whose Thigh The Goddess Of Wealth Mahalakshmi Show Her EagernessTo be seated, This Lady Is Adorning You With Lotus Flowered Garlands !🙏 🌹🌹 Oh Lord Whose Body Is Shining Like The Dazzling Gold , This Lady Is Paying Her Salutations Just With Her Pair Of Eyes , Glancing at You !🙏 Oh Lord You Are Great In All Aspects Inquire And Findout Yourself The Great Love Of This Woman Too !🙏 🌹🌹 Oh Handsome Lord Exceeding Crores of Cupids Put Together , You Have United With This Lady Nicely Showing Your Trace and Finesse !🙏 Bestowing The Sandal Perfume Like Your Presence You Are Ruling Me Now ! Oh Lord Narasimha !🙏 You Are That Divinely Perfumed Lord Sri Venkateswara Oh Lord Narasimha Who Emerged from The Pillar !🙏 🌹🙏🌹 Sri Lakshmi Nrusimha Mamadehi Karaavalambam !🙏 🌹🙏🌹 Om Sri Alamelumanga Sametha Sri Venkateswara Swaminey Namaha ! 🌹🙏🌹 ✍ -- Venu Gopal

  • @yvgannamayyaaksharavedam6942
    @yvgannamayyaaksharavedam694210 күн бұрын

    NARASIMHA VAIBHAVAM - 12 🌺🍃 ------------🍃🌺 అన్నమయ్య అక్షరవేదం ..సంపుటి -- 477 ( కరుణించవయ్య మమ్ము గంభమురాయ .. ) 🌺🍃 ----------- 🍃🌺 ఓం నమో వేంకటేశాయ. 🙏 అన్నమయ్య అక్షర వేదం ..సంపుటి -- 477 కి శుభ స్వాగతం ..🙏 ప్రార్థన ః--🌹🙏 ప్రాణేశ్వరుడవు లక్ష్మికి , వాణీనాథజనకుండ , వరనరసింహా ! జాణను నీ ప్రేమముకై శోణీవాగ్దలముతోడ స్తుతియింతునయా ! 🌹🙏🌹 ✍ --స్వీయపద్యము ( కందము ) 🌹🌹 ఓ లక్ష్మీ వల్లభా ! సరస్వతీపతి యైన బ్రహ్మకు తండ్రివైన , ఓ వరదుడవైన నారసింహా !🙏 నీ ప్రేమమును అమితముగా కోరుకొనుచున్న జీవనాయికనైన ఒక జాణను నేను , నీ పొందును వలచి వలచి నా పెదవులు యెరుపెక్కి పోయినవి ! ఆ పెదవులతోనే నిన్ను స్తుతిస్తున్నాను . నన్ను చేరదీసుకో చిరునవ్వుతో ఓ నరసింహా !!🙏 🌺🍃 -----------🍃🌺 మున్నుడి ః-- 🌹👇 అన్నమాచార్యుల వారు కర్నూలు , చిత్తూరు ,అనంతపురము , హంపివిజతనగరము పరిసర క్షేత్రములను దర్శించినప్పుడు ఆయా దైవాలపై చక్కగా కీర్తనలను రచించారు . ఇవి మన చారిత్రకారులకు ఎంతో ఉపయోగపడుచున్నవి నేటికినీ ! 🙏 ఇక్కడ ఈ కీర్తనలో "పెరె దేవుని కాలువ పెద్ద కంభపురాయ " అని పల్లవిలో స్తుతిస్తున్నారు . కంభపురాయడు అంటే నారసింహుడు . మరి ఇక్కడ ఏ నారసింహుడిని పేర్కొంటున్నారు ? పెరె అనగా జలాశయము కాలువ ఆనగా ఆ జలాశయపు చిన్న వాగు లేదా ప్రవాహము . వీటిని జాగ్రత్తగా పరిశీలిస్తే అన్నమాచార్యులవారు మద్దిలేటి లక్ష్మీ నరసింహ స్వామిని కీర్తిస్తున్నారని అర్థమగును . మద్దిలేరు జలాశయము పాయ గా ప్రవహించు కాలువ దరినే ఈ నారసింహ క్షేత్రమున్నది .🙏 ( బేతంచర్ల మండలము కర్నూలు జిల్లా ఆంధ్రప్రదేశ్ ). ఈ కీర్తనలో ఇంకొక విశేషమేమిటనగా , ఇది ఒక శృంగార రచనగా అందించారు .🙏 నారసింహునిపై అమితమైన ప్రేమమును పెంచుకుని ఉన్న ఒక జీవనాయిక వైనమును వర్ణిస్తూ కరుణించి చేరదీసుకో అని విన్నవిస్తున్నారు అన్నమయ్య .🙏 బహుశా నారసింహునిపై అనేకమైన శృంగార రచనలు రచించినది అన్నమయ్యనే యేమో ! అది ఆయనకే చెల్లినది .🙏 మరి ఆ చక్కని సంకీర్తన అర్థము తెలుసుకుని పాడుకుందామా !👇 🌺🍃 ----------- 🍃🌺 🌹🌹 స్తంభుమునుండీ నీ రూపమును చూపించిన ఓ నారసింహా , కాస్త కరుణచూపి నీ ప్రేమమును అందించు .🙏 జలాశయపు వాగు పక్కన కొలువైన ఓ నారసింహా ఓ మద్దిలేటి నారసింహా కరుణచూపు !🙏 🌹🌹 చక్కగా పకపకా పెద్దగా నవ్వెడి ఓ నారసింహా , ఈ పడతి సౌందర్యమును కాస్త చూడవయ్యా ! 🙏 ఏ తొడపై అయితే సిరులకాంత యైన శ్రీ మహాలక్ష్మి ఎక్కి కూర్చునటకు ఉత్సాహపడునో , అటువంటి గొప్ప తొడలుగల నారసింహా , ఈ పడతి నీకోసము కలువలు మాలలుగా అల్లి తెచ్చినదయ్య నీకు వేయుటకే ఉత్సాహపడుచూ !🙏 ఇక ఈమెను కరుణించరాదా ! 🙏 🌹🌹 బంగారు కాంతుల మేని ఛాయతో మెరిసిపోయే ఓ నారసింహా , ఈ వనిత తన కళ్లతోనే నీకు నమస్కారములు తెలుపుకొనుచున్నదయ్యా ! అంత భక్తి నింపుకుని ఉన్నది నీపై !🙏 నీవు అన్నీ తెలుసుకోగలిగే గొప్ప చతురుడవు కదా నరసింహా !🙏 ఈమె ప్రేమను విచారించి బాగుగా తెలుసుకుని చేరదీసుకోవయ్యా !🙏 🌹🌹 కోటి మన్మథులు అందమును పోలు సుందరాంగుడవైన ఓ నరసింహా , ఈ యువతికి నీ జాడ సరియైన విధముగా తెలిపి ఆమెతో కూడినావు !🙏 పరిమళ గంధముల తావిని మించిన నీ సన్నిధిని , ప్రసాదించి ఏలుకుంటున్నావు . ఈ శుభము చాలు !🙏 నీవు ఆ పరిమళ శోభితుడైన శ్రీ వేంకటేశ్వరుడవే ఓ నారసింహా ! 🙏 🌹🙏🌹 ఓమ్ శ్రీ అలమేలుమంగా సమేత శ్రీ వేంకటేశ్వర స్వామినే నమః !🙏 తాత్పర్య సహిత దృశ్య మాలికగా మీకు అందించాలన్న నా చిన్న ప్రయత్నమును ఆశీర్వదిస్తారని ఆశిస్తూ..🙏 దోషములున్న...మన్నించమని విన్నపము... 🙏 ( అన్నమయ్య అక్షర వేదం --- సంపుటి 477) ✍ -- వేణుగోపాల్ యెల్లేపెద్ది 🙏 🌹🌹 సంకీర్తన 🌹🌹 ॥పల్లవి॥ కరుణించవయ్య మమ్ముఁ గంభమురాయ పెరెదేవుని కాలువపెద్దకంభము రాయ ॥చ1॥ కలకలనవ్వు దేరేఁ గంభమురాయ ఇంతి- కలికితనాలు చూడు కంభమురాయ కలిమికాంత తొడెక్కెఁ గంభమురాయ నీపైఁ గలువదండలు వేసెఁ గంభమురాయ ॥చ2॥ కనకపువన్నె మేనికంభమురాయ ఇంతి కనుఁగవలనే మొక్కీఁ గంభమురాయ ఘనుఁడ వన్నిటా నీవు కంభమురాయ కనుకో వలపులెల్లాఁ గంభమురాయ ॥చ3॥ కందర్ప కోటిరూప కంభమురాయ ఇంతిఁ గందువలఁ గూడితివి కంభమురాయ గంద మిచ్చి నన్నేలితి కంభమురాయ మేలు గందము శ్రీ వేంకటాద్రి కంభమురాయ 🌹🙏🌹🙏🌹

  • @ramakrishnaanisingaraju7129
    @ramakrishnaanisingaraju712910 күн бұрын

    చక్కని భావగీతము. మీరు ఇచ్చిన కీర్తన గురించిన వివరణ, తదనుగుణంగా దృశ్యీకరణ అద్భుతంగా వున్నాయి. ధన్యవాదములు

  • @yvgannamayyaaksharavedam6942
    @yvgannamayyaaksharavedam694210 күн бұрын

    మీకు నా భావార్థ సహిత చిత్రమాలిక నచ్చినందుకు చాలా సంతోషమండి

  • @suryakumarianappindi9968
    @suryakumarianappindi996810 күн бұрын

    రీతిగౌళ్ళ రాగం?

  • @yvgannamayyaaksharavedam6942
    @yvgannamayyaaksharavedam694210 күн бұрын

    yes it is reeti gowla -- raagam adi talam composed by Sri vedavyasa Ananda bhattar garu

  • @suryakumarianappindi9968
    @suryakumarianappindi996810 күн бұрын

    @@yvgannamayyaaksharavedam6942 ధన్యవాదములు

  • @suryakumarianappindi9968
    @suryakumarianappindi996810 күн бұрын

    దయచేసి రాగం తెలియచేయండి

  • @yvgannamayyaaksharavedam6942
    @yvgannamayyaaksharavedam694210 күн бұрын

    it is reeti gowla -- raagam adi talam composed by Sri vedavyasa Ananda bhattar garu