Yadagiri Lakshmi Narasimhaswamy Temple!!! యాదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం!!! 2024

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం, యాదాద్రి భువనగిరి జిల్లాలో ఒక దివ్య క్షేత్రం. యాదాద్రికి సంబంధించిన కథకు మూలం వాల్మీకి రామాయణంలో ఉంది. విభాండక ఋషి కుమారుడు రుష్యశృంగుడు. అతని కుమారుడు హాద ఋషి. అతనినే హాదర్షి అని కూడా అంటారు. అతను నరసింహ స్వామి భక్తుడు. అతనికి స్వామివారిని ప్రత్యక్షంగా చూడాలని కోరిక పుట్టింది. ఆంజనేయస్వామి సలహా మేరకు తపస్సు చేయగా స్వామి ప్రత్యక్షమవుతాడు. ఆ ఉగ్ర నరసింహ మూర్తిని చూడలేక శాంత స్వరూపంతో కనిపించమని యాదర్షి కోరగా స్వామి వారు కరుణించి లక్ష్మి సమేతుడై దర్శన మిచ్చి "ఏంకావాలో కోరుకో" మంటే యాదర్షి స్వామి వారికి "శాంత మూర్తి రూపంలోనె కొలువై కొండపై ఉండి పొమ్మని కోరాడు. ఆవిధంగా లక్ష్మి నరసింహ స్వామి కొండపై అలా కొలువై ఉండి పోయాడు. కొన్నాళ్ళకు స్వామివారిని వేర్వేరు రూఫాల్లో చూడాలనిపించి యాదర్షి మరలా తపస్సు చేశాడు. అతని కోరిక మేరకు స్వామి వారు జ్వాలా, యోగా, నంద, గండబేరుండ, నారసింహ రూపాల్లో దర్శనమిచ్చాడు. అందుకే ఈ క్షేత్రాన్ని పంచ నారసింహ క్షేత్రం అంటారు. ఆ ఋషి కోరిక మీదే ఆ కొండ యాదగిరిగా ఋషి పేరుమీద ప్రసిధ్ధికెక్కింది. ఆ ఋషి తపస్సు చేసింది, స్వామి ప్రత్యక్షమైంది కొండ క్రింద వున్న పాత లక్ష్మీ నరసింహస్వామి గుడి దగ్గర అని చెప్తారు. యాద మహర్షి కోరిక మీదే ఆంజనేయస్వామి యాదగిరిలో క్షేత్రపాలకుడుగా ఉన్నాడు. చాలామంది భక్తులు ఆరోగ్యం, గ్రహపీడా నివారణ, వగైరా కోరికలతో కొన్నాళ్ళపాటు ఇక్కడ వుండి విష్ణు పుష్కరిణిలో స్నానం చేసి స్వామిని సేవిస్తారు. అంతేగాక ఇప్పటికీ రోజూ రాత్రుళ్ళు ఆ చుట్టుప్రక్కల కొండలమీద తపస్సు చేసుకుంటున్న ఋషులు విష్ణు పుష్కరిణిలో స్నానం చేసి స్వామిని అర్చిస్తారుట. దానికి నిదర్శనంగా వారు వచ్చేటప్పడు మృదంగ ధ్వనులువినిపిస్తాయట. పాదాల గుర్తులు కొందరు చూశారుట. వారు స్వామిని అర్చించిన గంధ పుష్పాదులు కూడా నిదర్శనమంటారు. యాదగిరి గుట్టకు ప్రవేశ ద్వారము
శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం యాదగిరిగుట్ట
మెట్ల మార్గాన వెళ్తే దోవలో శివాలయం కనబడుతుంది. ఇక్కడ శివుడు లక్ష్మీ నరసింహస్వామి కన్నా ముందు స్వయంభూగా వెలిశాడు. ఇంకో విశేషం .. ఈ మెట్లు ఎక్కి స్వామిని సేవించినవారి కీళ్ళ నొప్పులు తగ్గుతాయని భక్తుల విశ్వాసం. యాదగిరి గుట్ట పుణ్యక్షేత్రములో రెండు లక్ష్మీ నరసింహస్వామి ఆలయములు ఉన్నాయి. పాత లక్ష్మీనరసింహస్వామివారి ఆలయము. కొత్త లక్ష్మీనరసింహస్వామివారి ఆలయము.
మరొక కథనం ప్రకారం లక్ష్మీ నరసింహస్వామివారు మొదట పాత లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో వెలసి తరువాత కొత్త లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయమునకు గుర్రముమీద వెళ్ళేవారు. మనము ఇప్పటికీ ఆ గుర్రపు అడుగులు ఆదారిన చూడవచ్చు. ఈ గుర్తులు పాత లక్ష్మీనరసింహస్వామివారి ఆలయం నుండి కొత్తలక్ష్మీనరసింహస్వామివారి ఆలయము వరకు ఉన్నాయి. పాత లక్ష్మీనరసింహస్వామి ఆలయంనందు, ఆంజనేయ స్వామి వారి ఆలయము కూడా ఉంది. అక్కడ గోడ మీద ఉన్న చిత్రములు చాలా అద్భుతంగా ఉన్నాయి. అక్కడ నుండి కొత్త లక్ష్మీనరసింహస్వామివారి ఆలయమునకు వెళ్ళు దారిలో ఆంజనేయ స్వామి వారి మరొక ఆలయము కూడా ఉంది. ఈ ఆలయగర్భగుడిలో స్వామివారి వద్ద నిత్యము ఒక జల ప్రవాహము ఉంది. ఆ జలముతోనే నిత్యము స్వామివారికి అభిషేకం చేస్తారు.It is the most unique, beautiful and pleasant Hillock with moderate Climate in all seasons and the temple is located at a distance of about 60 KM from the Hyderabad, capital city of Telangana. The flow of devotees / pilgrims visiting the temple for worship is very high since it is situated near the capital city. Every day not less than 5000-8000 pilgrims on average visits this temple for offering their vows, performing of saswata pujas ,saswata kalyanam,LakshaTulasi Pujas ,Abhisekam etc.,.. There will be heavy congregation of devotees / pilgrims during Saterdays, Sundays and other Public Holidays.
Sri Lakshminarasimha Swamy Temple or Yadagirigutta is a popular Hindu Temple of Narasimha Swamy, an incarnation Lord Vishnu It is situated on a hillock in the Nalgonda district, Telangana, Yadagirigutta is at a distance of 6 KM from Riagir Railway station and at a distance of 13 KM from Bhongir Town and 60 kilometers from the city of Hyderabad.

Пікірлер: 8

  • @GaneshbabuKetha
    @GaneshbabuKethaАй бұрын

    Baga cheppav anna

  • @ExplorerNagarjunaLella

    @ExplorerNagarjunaLella

    Ай бұрын

    Thank you thammudu 😊

  • @vikramthriveni
    @vikramthriveni2 ай бұрын

    Good keep it up Villain

  • @ExplorerNagarjunaLella

    @ExplorerNagarjunaLella

    2 ай бұрын

    Thank you Buddi 😊

  • @NandhiniNandu-mp4cf
    @NandhiniNandu-mp4cfАй бұрын

    Memu kuda monnane vellinam anna

  • @ExplorerNagarjunaLella

    @ExplorerNagarjunaLella

    Ай бұрын

    Ok, please support my channel

  • @NandhiniNandu-mp4cf
    @NandhiniNandu-mp4cfАй бұрын

    Mumu kuda vellinam anna

  • @ExplorerNagarjunaLella

    @ExplorerNagarjunaLella

    Ай бұрын

    Good

Келесі