సినీఫక్కీలో దారి దోపిడి.. చివరకు...! - TV9

మంగళగిరికి చెందిన గుర్రంకొండ రాము, తాడేపల్లికి చెందిన వీరాంజనేయులు బంధువులు. రాము బంగారు వస్తువులు తయారు చేస్తూ ఇతర ప్రాంతాల్లో విక్రయిస్తుంటాడు. ఈ క్రమంలో కొన్నాళ్లుగా బంగారంపై పెట్టుబడి పెడితే మంచి ఆదాయం వస్తుందని రాము చెప్పగా.. వీరాంజనేయులు విడతల వారీగా రూ.90 లక్షలు చెల్లించాడు. ఆ సొమ్ము తిరిగి ఇవ్వమని వీరాంజనేయులు ఒత్తిడి చేశాడు. దీంతో ఒత్తిడి తట్టుకోలేని రాము ఏదైనా సలహా చెప్పమని తన స్నేహితుడు రత్నం వద్దకు వెళ్లాడు. రత్నం..... రాముని.. బబ్లూ వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ ముగ్గురు కలిసి దారి దోపిడి డ్రామాకు తెర తీశారు. తాను విజయవాడ నుండి బంగారు తీసుకొస్తుండగా కొట్టి ఆ బ్యాగ్ తీసుకెళ్లాలని అలా చేస్తే పది లక్షలు ఇస్తానని రాము.... బబ్లూతో చెప్పాడు. ఇందుకు ఒప్పుకున్న బబ్లూ... అతని స్నేహితులైన ప్రసన్నతో అసలు విషయం చెప్పి సాయం చేస్తే ఐదు లక్షలు ఇస్తానని ఒప్పుకున్నాడు. ఇందుకు సరే అన్న ప్రసన్న సమయం కోసం వేచి చూస్తున్నాడు.
►TV9 Website : tv9telugu.com/
►News Watch : bit.ly/3g9b8IG
►KNOW THIS : bit.ly/3APEpAj
►PODCAST : bit.ly/3g7muNw
► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
► Download Tv9 IOS App: goo.gl/abC1bS.
#Robbery #Tadepalle #andhrapradesh
Credit: #rajeshwari /Producer || #TV9D

Пікірлер

    Келесі