రాళ్లబండి శశి శ్రీ కవితా సంపుటి 'అనుమంద్రం(Anumandhram)' పుస్తకావిష్కరణ సభ

రాళ్లబండి శశి శ్రీ కవితా సంపుటి 'అనుమంద్రం(Anumandhram)' పుస్తకావిష్కరణ సభ#RallabandiSasiree
దాదాపు పన్నెండేళ్ళగా ఫేస్బుక్ లో కవిత్వం రాస్తున్నాను. కొన్ని అనుకోని కారణాల వల్ల పుస్తకం తేవడం లేటయింది. ఇప్పుడు నా మొదటి కవితా సంపుటి 'అనుమంద్రం' త్వరలోనే రాబోతోందని మీకు తెలియజేయటానికి సంతోషిస్తున్నాను.ఎవరి ప్రోత్సాహంతో కవిత్వం రాయడం కొనసాగించానో, ఎవరు నాకు పెద్ద అండా దండా అని భావించానో ఆయన మా నాన్నగారు ఈ పుస్తకం తెస్తున్న సమయానికి లేరని బాధనిపిస్తోంది. అయినప్పటికీ ఆయన కోరికమేరకు కవిత్వ రచన చేస్తున్నాను, పుస్తకం తెస్తున్నాను అని తృప్తిగానే ఉంది. నేను ఫేస్బుక్ లో కవిత్వం రాస్తున్నప్పటి నుంచి కవిసంగమం మిత్రులు, ఫేస్బుక్ మిత్రుల ప్రోత్సాహం మర్చిపోలేనిది. మీ ప్రోత్సాహం ఎప్పటికీ ఇలాగే ఉంటుందని ఆశిస్తూ... నా పుస్తకం 'అనుమంద్రం' మీ ముందుకు...
రాళ్లబండి శశి శ్రీ.

Пікірлер

    Келесі