Osmania University Law College Principal _ Gummadi Anuradha

వందేళ్ల ఉస్మానియా యూనివర్శిటీ మరో ఘనతను సాధించింది. యూనివర్శిటీ పరిధిలో న్యాయ కళాశాల ప్రిన్సిపాల్ గా గుమ్మడి అనురాధ నియమితులై వందేళ్ల ఉస్మానియా విశ్వవిద్యాలయ చరిత్రలో రికార్డ్ సృష్టించారు. ప్రిన్సిపాల్ గా బాధ్యతలు చేపట్టిన అతి చిన్న వయస్కురాలే కాకుండా న్యాయ కళాశాల ప్రిన్సిపాల్ గా ఎంపికైన తొలి ఆదివాసి మహిళగా ఆమె ప్రత్యేకతను సాధించారు.
........ పాజ్ ........
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులగూడంకు చెందిన గుమ్మడి అనురాధ వెనుకబడిన వర్గానికి చెందినప్పటికీ చిన్నప్పటి నుండి చదువులో ముందంజలో ఉన్నారు. తండ్రి గుమ్మడి నర్సయ్య ఐదుసార్లు ఎమ్మెల్యే అయినప్పటికీ - అనురాధ ఇంటర్ వరకు ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలోనే చదువుకున్నారు. తన సామాజిక వర్గంలో ఉన్నత విద్య అభ్యసించిన వారు చాలా తక్కువ మంది ఉన్నప్పటికీ తండ్రి స్ఫూర్తితో ఆమె న్యాయ విద్యలో పట్టభద్రులయ్యారు. పోస్టు గ్రాడ్యూయేషన్ అయిన తర్వాత PhD కూడా చేసి అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఉద్యోగంలో చేరారు. అనతికాలంలోనే న్యాయకళాశాల ప్రిన్సిపాల్ స్థాయికి ఎదిగి ఇటీవల బాధ్యతలు చేపట్టారు.
ఈ సందర్భంగా గుమ్మడి అనురాధ దూరదర్శన్ తో మాట్లాడుతూ - నాన్న స్పూర్తితో, ఆదర్శంతో ముందుకు వెళ్తున్నానని చెప్పారు. న్యాయ కళాశాలను మరింత అభివృద్ధి చేసేందుకు మరింత కృషి చేస్తానని చెప్పారు. ... బైట్ ........

Пікірлер: 4

  • @chittichill8790
    @chittichill87902 жыл бұрын

    Great 🙏🙏🙏

  • @pravi3339
    @pravi3339 Жыл бұрын

    God bless you ma...

  • @narayanakonda5473
    @narayanakonda547311 ай бұрын

    Super

  • @saidulutallapallitallapall3752
    @saidulutallapallitallapall3752 Жыл бұрын

    Congratulations 🎊 akka

Келесі