ఒకే జిల్లాలో రెండు రెసిడెన్షియల్ పాఠశాలలకు ఏ విధంగా కిరాయి చెల్లిస్తారని...

NN news మండపేట
ప్రభుత్వ భవనాలు ఉండగానే ప్రవేట్ బావనాలలో ఎస్సి రెసిడెన్షియల్ పాఠశాలలు కొనసాగిస్తున్నారు.
ఒకే జిల్లాలో రెండు రెసిడెన్షియల్ పాఠశాలలకు ఏ విధంగా కిరాయి చెల్లిస్తారని ఏజెన్సీ సేవా సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మండిపడ్డారు.ములుగు జిల్లాలోని ఏటూరు నాగారం మండల కేంద్రంలో గత 6 సంవత్సరల నుండి మంగపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ బావనాలలో ఎస్సి రెసిడెన్షియల్ పాఠశాల కొనసాగించేది కానీ, ప్రభుత్వ భవనాలు రెండు ఉండగా ఎందుకు మంగపేట నుండి మలంపేలి గ్రామానికి తరలించారు?
ఆ ప్రభుత్వ బావనాలపైన సుమరుగా 76 లక్షల తో బిడ్లిగ్ మంజూరు అయితే" ఆ బిడ్లిగ్ ఎందుకు కట్టలేదు? దీనికి కారకులు ఎవరు? కాంట్రాక్టు తీసుకున్న వార.. లేక స్కూల్ యాజమాన్యమే లేక,ఉమ్మడి వరంగల్ జిల్లా అధికార యంత్రాంగమా..జిల్లాలో ప్రభుత్వ భవనాలు ఉండగా రెండు ప్రవేట్ భవనాలకు ఏవిధంగా కిరాయిలు చెలిస్తారు?
మంగపేట నుండి ఎత్తివేసిన స్కూల్ ప్రభుత్వ భవనాలు ఈ బావనాలలో క్రీడా మైదానం అని ఒక బోర్డు పెట్టి మంచిగా ఉన్న పాఠశాలను స్వార్ధ పరులు కలసి మంగపేట నుండి మల్లంపేలి కి తరలించిన వారిలో జిల్లా ఉన్నతాధికారులు, మరియు జిల్లాలో ఉన్న ప్రజా ప్రతినిధులు కలసి. ఈ ఎస్సి రెసిడెన్షియల్ పాఠశాలను తరలించారు.
వెంటనే మంగపేట ప్రభుత్వ బావనాలలో ఎస్సి రెసిడెన్షియల్ పాఠశాలను పునర నిర్మాణం చేయాలని ఏజెన్సీ దళితుల సేవా సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పరికి శ్రీనివాస్ రాష్ట్ర ప్రభుత్వా అధికారులను కోరడమైనది.

Пікірлер

    Келесі