నీట్‌ యూజీ కౌన్సెలింగ్ వాయిదా | NEET UG 2024 Counselling Deferred Till Further Notice

వైద్యవిద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించాల్సిన నీట్ యూజీ కౌన్సిలింగ్ ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ- NTA వాయిదా వేసింది. నేటి నుంచి కౌన్సిలింగ్ జరగాల్సి ఉండగా...... తదుపరి ప్రకటన వచ్చే వరకు వాయిదా వేస్తున్నట్లు NTA ప్రకటించింది. నీట్ యూజీ పరీక్ష ప్రశ్న పత్రం లీకేజీ అయినట్లు ఇటీవల ఆరోపణలు రాగా.. ఆ కేసును కేంద్ర ప్రభుత్వం సీబీఐకి అప్పగించింది. నీట్ పరీక్షల్లో అవకతవకలపై.... సీబీఐ ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసింది. ప్రశ్నాపత్రాల లీకుపై పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించగా..నీట్ కౌన్సిలింగ్ వాయిదా వేసేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. నీట్ నిర్వహణ తీరుపై ఎల్లుండి సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో ఇవాళ్టి నుంచి జరగాల్సిన నీట్ యూజీ కౌన్సెలింగ్ ను NTA వాయిదా వేసింది. కౌన్సిలింగ్ తేదీలను తర్వాత ప్రకటిస్తామని వెల్లడించింది. మే 5న దేశవ్యాప్తంగా నీట్ పరీక్షను ఎన్టీఏ నిర్వహించింది. ఈ పరీక్షల్లో కొందరికి 720కి 720 మార్కులు రావడంతో దేశవ్యాప్తంగా ఆందోళన చెలరేగింది. పరీక్ష ఆలస్యంగా ప్రారంభమైదంటూ కొందరికి గ్రేస్ మార్కులు కలపగా...720కి 720 మార్కులు వచ్చిన వారిలో వారు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గ్రేస్ మార్కులు కలిపిన వారికి ఇటీవలే మళ్లీ పరీక్ష నిర్వహించారు. ఆ ఫలితాలను కూడా కలిపి సవరించిన ర్యాంకులను NTA ప్రకటించింది. దేశవ్యాప్తంగా నీట్ ను మళ్లీ నిర్వహించాలని ఆందోళనలు కొనసాగుతుండగా...ఇప్పుడు కౌన్సిలింగ్ ను వాయిదా వేసింది
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
☛ Visit our Official Website: www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
☛ Subscribe to our KZread Channel : bit.ly/JGOsxY
☛ Like us : / etvandhrapradesh
☛ Follow us : / etvandhraprades
☛ Follow us : / etvandhrapradesh
☛ Etv Win Website : www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------

Пікірлер: 2

  • @asnrprasad8825
    @asnrprasad882521 күн бұрын

    Government medical college self finance ethiveyali sir 🙏

Келесі