Lingam sper | లింగన్నపేట గడి

తెలంగాణ నిజాం పాలనలో ఉన్నప్పుడు దొరల గడీలు ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి.
దొరల గడీలు అయిదారు వందల సంవత్సరాల వైభవాన్ని చవి చూశాయి. నాటి చరిత్రకు చిహ్నాలుగా ఇప్పుడు మిగిలిపోయాయి. కాకతీయుల కాలంలో రేచర్ల వెలమలు, పొలవాస పద్మనాయకులు సామంతరాజ్యంగా ఒక శతాబ్దం పాటు పరిపాలించారు.
ఎలగందుల జిల్లా పరిధిలో నైజాం రాచరికానికి అనుబంధంగా ఉండేది. వీరు ఇంటి పన్నులు, వ్యవసాయ ఇతర శిస్తులు వసూలు చేసి, నిజాంకు చెల్లించేవారు.
గడీలలో సుంకరులు, నీరటిగాళ్లు, గుమాస్తా సిబ్బంది పని చేసేవారు. పోలీస్ వ్యవస్థ కూడా వీరి రాచరికపు అధికారానికే మద్దతు పలుకుతుండేది. కుతుబ్‌షాహీలు, మొగలాయిలు, ఆసఫ్‌జాహీల కాలంలో గడీల పాలనా వైభవం అవిచ్ఛన్నంగా కొనసాగింది. గడీలు కాకతీయుల చివరి కాలం నుంచే ఉన్నాయని అంటారు. కాకతీయులు, విజయనగర రాజుల కాలంలో పిండారీలు, రోహింగ్యాల దాడుల నుంచి రక్షణకు 18వ శతాబ్దం ఆరంభంలో వీటిని నిర్మించారు. ఇటుకలతో నిర్మించిన బురుజులు వంద, యాభై అడుగుల ఎత్తులో ఉండి, వాటి చుట్టూర తుపాకులు ఉపయోగించడానికి చిన్న చిన్న రంధ్రాలను ఏర్పాటు చేసేవారు. కోటలలో ఫిరంగులను వాడే వ్యవస్థ ఉంటే, గడీలలోని బురుజులలో మాత్రం తుపాకులు ఉపయోగించే విధానం ఉండేది. ఆ చారిత్రక చిహ్నాలు నేటికీ కనిపిస్తున్నాయి.
1920-48 మధ్యలో తెలంగాణా సాయుధ రైతాంగ పోరాటాలు జరిగినప్పుడు గడీల దొరల దాష్టీకాలు, దాడుల గురించి, మా భూమి, దాశరథి రంగాచార్యుల రచనలలో నాటి వ్యవస్థ తీరు తెన్నులు, ప్రజల తిరుగుబాటు, అరాచకాల ప్రస్తావనలు ఉన్నాయి. గడీల దొరలు ప్రజానుకూలంగా కూడా పరిపాలన చేశారని, అనేక దానాలు చేశారని రికార్డులు చెబుతున్నాయి. కొంతమంది దొరలూ, దొరసానులు కూడా రాచరిక వ్యవస్థ మీద జరిగిన ప్రజా తిరుగుబాట్లకు నాయకత్వం వహించిన దాఖలాలను కూడా పలువురు ప్రస్తావించారు.
మూడు వందల ఏళ్ల దర్పానికి, మినీ రాజరికానికి సంకేతాలుగా నిలిచిన గడీల దొరల పాలన అంతరించి పోయినా, ఈ అంశాలు చరిత్ర పుటలలో సరిగా రికార్డు కావాల్సి ఉందని చరిత్రకారులు భావిస్తున్నారు. కుతుబ్‌షాహీలు, మొగలాయిలు, నిజాం ప్రభువుల కాలం నుండి ఉన్న గడీల బురుజు కట్టడాలను పురావస్తు చిహ్నాలుగా గుర్తించాలి. కబ్జాలు, కూల్చివేతలు జరగకుండా నిషేధించాలి. ఈ మేరకు దీనిని 2017 పురావస్తు (తెలంగాణ హెరిటేజ్ చట్టం, 2017) శాఖ పరిధిలోకి తేవాలని, వీటి చరిత్రలను రికార్డ్ చేయాలని చరిత్రకారులు కోరుతున్నారు.

Пікірлер: 5

  • @shivaprasad9181
    @shivaprasad91814 ай бұрын

    ఉన్న వాటిని కాస్త మరమ్మత్తులు చేసి ప్రజల సందర్శనార్థం ఉంచితే బాగుంటుందేమో ! 👌👌

  • @janathanews3527
    @janathanews3527 Жыл бұрын

    *లింగన్నపేట గడీ* *వందల సంవత్సరాల వైభవాన్ని చవి చూసి. నాటి చరిత్రకు చిహ్నాంగా ఇప్పుడు మిగిలింది* *మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి* kzread.info/dash/bejne/lZpsy5muf8u6kbw.html

  • @vedabhoomi369
    @vedabhoomi3693 ай бұрын

    ఈ గడి లో ఎదో సినిమా తీశారు కానీ గుర్తుకు రావడం లేదు ఎవరైనా తెలిస్తే చెప్పండి

  • @NarayanadasuAnjaiah

    @NarayanadasuAnjaiah

    3 ай бұрын

    దాసి

  • @munjalasanjeevamunjalasanj7243
    @munjalasanjeevamunjalasanj7243 Жыл бұрын

    కల్లేడ గడీ కూడా ప్రబుత్వం స్వాధీనం చేయలేడు ఈ దుర్మార్గం ని ఎర్రబెల్లి దయకరరావు కాపాడుతున్నాడు ప్రబుత్వ పస్లేటి దొరలు ఇస్తున్నట్టు స్కూల్ నడుపుతున్నారు

Келесі