#LearnWithMe

Музыка

Mangalamu Govindunaku music video link:
• Mangalamu Govindunaku
Lyrics: Sri Tallapaka Annamacharya
Music: Sri Garimella Balakrishna Prasad
Ragam: AanandaBhairavi
Talam: Mishrachapu
Moorchana:
S G₂ R₂ G₂ M₁ P D₂ P Ṡ
Ṡ N₂ D₂ P M₁ G₂ R₂ S
(chathusruthi rishabham, sadharana gandharam, shuddha madhyamam, Chatusruthi dhaivatham, kaishiki nishadham)
Lyrics (Telugu):
పల్లవి
మంగళము గోవిందునకు జయమంగళము గరుడధ్వజునకును
మంగళము సర్వా త్మకునకు ధర్మస్వరూపునకూ - జయజయ
చరణం 1
ఆదికినినాదైన దేవున కచ్యు తున కంభోజనాభున-
కాదికూర్మంబైన జగదాధారమూర్తికిని
వేదరక్షకునకును సంతతవేదమార్గవిహారునకు బలి-
భేదికిని సామాదిగానప్రియవిహారునకు
చరణం 2
హరికిఁ బరమేశ్వరునకును శ్రీధరునకును గాలాంతకునకును
పరమపురుషోత్తమునకును బహుబంధదూరునకు
సురమునిస్తోత్రునకు దేవాసురగణశ్రేష్రే్టునకు కరుణా-
కరునకునుఁ గాత్యా యనీ నుతకలితనామునకు
చరణం 3
పంకజాసనవరదునకు భవపంకవిచ్ఛేదునకు భవునకు
శంకరున కవ్యక్తునకు నాశ్చర్యరూపునకు
వేంకటాచలవల్లభునకును విశ్వమూర్తికినీశ్వరునకును
పంకజాకుచకుంభకుంకుమపంకలోలునకు
Lyrics (English):
Pallavi
mangaLamu gOvindunaku jayamangaLamu garuDadhwajunaku
mangaLamu sarvAtmunaku dharmaswarUpunaku -- jaya jaya
Charanam 1
Adikini nAdaina devunakachyutuna kambhOjanAbhuna-
kAdikUrmambaina jagadAdhAramoortikini
vEdarakshakunakunu santata vEdamArgavihArunaku
balibhEdikini sAmAdigAna priyavihArunaku -- jaya jaya
Charanam 2
harikiparamESwarunakunu SrIdharunakunu kAlAntakunakunu
paramapuruShOttamunakunu bahubandhadUrunaku
suramunistOtrunaku dEvAsuragaNaSreshtunakunu
karuNAkarunakunu kAtyAyanInuta kalitanAmunaku
Charanam 3
pankajAsana varadunaku bhava pankavicchEdhunaku bhavunaku
Sankarunakavyatunaku nAscarya rUpunaku
vEnkaTAcala vallabhunakunu viSwamoortiki nIswarunakunu
pankajAkucakumbha kumkuma pankalOlunaku - jaya jaya
#garimella #kriti #sankeerthana #anandabhairavi #govinda
#mangalam #tallapaka #anilakumar #balakrishnaprasad #learnwithme #annamayya #anila #learn

Пікірлер: 56

  • @AnilaKumarGarimella
    @AnilaKumarGarimellaАй бұрын

    Song Intro 11:07 Ragam Intro 11:35 Lyrics Explanation 18:11 Pallavi 25:09 1st Charanam 29:15 2nd Charanam 41:46 3rd Charanam 48:19 Full song. 54:39 Song With Tabla. 1:05:00 (NaadSadhana App)

  • @vaidehigarimella6475
    @vaidehigarimella647529 күн бұрын

    Maha adbhutam ga padaru .🙏🙏🙏🙏🙏

  • @saradainkulu2500
    @saradainkulu250027 күн бұрын

    చాలా బాగుంది గురువూ గారు

  • @dhanalakshmi6866
    @dhanalakshmi6866Ай бұрын

    నమస్తే అండి🎉 చాలా బాగా వివరించి చెప్పారు ఈ రోజు శనివారం ఆ స్వామి వారి మంగళ హారతి విని , నేర్చుకుని తరించే అవకాశం కల్పించారు చాలా సంతోషం 🎉🎉

  • @AnilaKumarGarimella

    @AnilaKumarGarimella

    Ай бұрын

    అంతా దైవేచ్ఛ! 🙏

  • @ramanipotukuchi7206
    @ramanipotukuchi7206Ай бұрын

    🙏🏻 అండి. మీరు చాలా బాగా వివరించి చెప్తున్నారు. ఈ పాట మీరు ఇంతకు ముందు పాడారు చాలా బాగుంది అనుకున్నాను. ఇప్పుడు మీరు నేర్పించి నందుకు ధన్య వాదములు. గురువుగారు మీ నాన్నగారు పాటలు వింటూ అన్నమయ్య కీర్తనల మీద చాలా మక్కువతో వింటూ ఉండగా హరి సంకీర్తనం కార్య క్రమం రూపంలో నేర్చుకోకలిగే అవకాశం కలిగింది కొన్ని పాటలు నేర్చుకున్నాను. ఇప్పుడు మీరు ఈ విధంగా నేర్పించడం మా వంటి వారికి ఎంతో సులువుగా ఉంది. 🙏🏻

  • @gayatrirani3711
    @gayatrirani371129 күн бұрын

    నమస్కారమండి.

  • @saiprasanna4277
    @saiprasanna4277Ай бұрын

    నమస్తే గురువు గారికీ, మేము ఊ కీర్తన నేర్చుకుని మొన్న అన్నమయ్య జయంతి ఉత్సవాలకు పాడినందుకు చాలా చాలా ఆనందము గా ఉన్నది, మరల మీ దగ్గర నేర్చుకుంటున్నందుకు ఇంకా ఆనందముగా ఉన్నది, ఇలా తెలియని అన్నమయ్య కీర్తనలు కొన్నింటిని నేర్చుకుని 3 years నుండీ అన్నమయ్య జయంతి ఉత్సవాలకు programmes లో నేను కూడా ఒక part అయినందుకు చాలా ఆనందకరమైన ఉన్నది,మాకు ఎంతో శ్రద్ధ చూపి నేర్పుతున్న మా గురువు గారికి హృదయపూర్వక ధన్యవాదములు

  • @AnilaKumarGarimella

    @AnilaKumarGarimella

    Ай бұрын

    Wow. Wonderful. Thank you! :)

  • @sailupanguluri
    @sailupanguluriАй бұрын

    How to thank god and u for resuming this wonderful LWM series after such a long gap. Otw, how many beautiful experiences we would have missed. Each session is a different experience. It takes a lot of time to come back to a normal state after every session. It’s not just about learning how to sing a Samkirtanam but it’s beyond that, where words can’t explain. So many feelings, emotions, nostalgic moments and what not!! I never want to miss. Sudden ga oka raagaalapana or gamakamo paadataaru that will haunt for some days. We always return with heavy hearts. Thanks for giving so many wonderful experiences. My father always loved to take us for Ekanta seva@ Govindaraja Swami temple. When u were saying about Govindaraja swami utsavam I was able to recall all those moments. Totally enjoyed each minute of the session today. More specifically raagalapana and 2nd,3rd caranams. I was wondering how u were able to manage to do Chitikelu thru out the samkirtanam. Fully enjoyed and in the end with Nadsadhana app too. Recently listened to “tolliyunu marraaku” by guruvugaru@SVASA’s concert. Since then longing to listen that in ur voice andi. Pls try to do ur fav lines from that as a short video or in LWM whenever u can pls. After“ Alaracancalamina” this has became my fav raagamalika. Mangalamu tarwata Pavalimpu seva kuda avvali kada Swami vaariki mari🙏🙏. Thanks again for giving us such a wonderful session🙏

  • @KamarajugaddaSrilakshmi
    @KamarajugaddaSrilakshmiАй бұрын

    🙏🙏🙏💐

  • @sunitha3963
    @sunitha3963Ай бұрын

    Namasakaramulu gurulaki🙏🙏🙏

  • @LakshmiKrishnakumar
    @LakshmiKrishnakumarАй бұрын

    Yes, please proceed.

  • @radhikagiridharramanujadas7807
    @radhikagiridharramanujadas7807Ай бұрын

    Chala madhuramaina kirthana miru atyadbhuthamga padarandi e kirthana 🙏

  • @nemmalurisailaja5619
    @nemmalurisailaja5619Ай бұрын

    Raagam: Anandabhairavi

  • @padmajanandagiri5102
    @padmajanandagiri5102Ай бұрын

    🙏🙏

  • @joshi7947
    @joshi7947Ай бұрын

    Namaskaram Guruvugaru This is adhyatmasangeetsatsangam What a relief to hear relatively simpler song. Depth of knowledge, wisdom and devotion is surely behind tuning this song but the credit for this song being chosen,for this time goes to only to Lord of Seven Hills.. Om Namo Venkatesaaya

  • @AnilaKumarGarimella

    @AnilaKumarGarimella

    Ай бұрын

    "adhyatmasangeetsatsangam"! Indeed it is. Dhanyosmi.

  • @vallibhandaram1219
    @vallibhandaram1219Ай бұрын

    Chala bagundi guruvugaru

  • @padmalatha5185
    @padmalatha5185Ай бұрын

    Namaskaram guruvu garu. 🙏

  • @venkatramana5977
    @venkatramana5977Ай бұрын

    నమస్కారం గురువు గారికి.

  • @dhanalakshmimankala7848
    @dhanalakshmimankala7848Ай бұрын

    Namaskaaru Guruwugaaru🙏🏼💐

  • @svsuryaprabha2557
    @svsuryaprabha2557Ай бұрын

    Chaala baagundi sir.🙏💐

  • @leelabhogaraju9078
    @leelabhogaraju9078Ай бұрын

    Heard a new song today, thank you

  • @swarnalatha451
    @swarnalatha451Ай бұрын

    🙏🙏🙏

  • @shaniarugonda691
    @shaniarugonda691Ай бұрын

    Namaskaram guruvu gaaru

  • @padmarayala5729
    @padmarayala5729Ай бұрын

    🙏🏻🙏🏻 chala satoshamandi epata nerpinaduku.

  • @radm9483
    @radm9483Ай бұрын

    Namaskaramguru గారు

  • @suvarnaharati5002
    @suvarnaharati5002Ай бұрын

    🙏🙏🙏 namaste we rlearning so much from u thank u very much

  • @seshukumarik6387
    @seshukumarik6387Ай бұрын

    Thank you for this!!! అద్భుతమైన కీర్తన ❤చాలా బాగా వివరించారు 🙏 We are blessed..

  • @LakshmiKrishnakumar
    @LakshmiKrishnakumarАй бұрын

    Namaskaram.

  • @mukthapuramlakshmilakshmi2847
    @mukthapuramlakshmilakshmi2847Ай бұрын

    Super singing and also beautifully explained. 👌🙏

  • @satyavathipuranam6785
    @satyavathipuranam6785Ай бұрын

    జై శ్రీకృష్ణ దీర్ఘాయుష్మాన్ భవ

  • @AnilaKumarGarimella

    @AnilaKumarGarimella

    Ай бұрын

    🙏

  • @bharathikrishnamoorthi501
    @bharathikrishnamoorthi501Ай бұрын

    Namaskaram Sir. I am Bharathi from Srirangam. Naaku mother tongue Telugu. But i can't read and write Telugu. Because I am born and brought up Tamilnadu. Mee anega paatalu nerrchukunnanu. Excellent teaching n rendition. My pranams to you and your Thandri garuki. Spoken telugu bagane matladuthaamu. I am a music teacher also. Thank you so much.

  • @AnilaKumarGarimella

    @AnilaKumarGarimella

    Ай бұрын

    Romba sandhosham! Thank you🙏

  • @surendrababu4472
    @surendrababu4472Ай бұрын

    నమస్తే సార్

  • @bharatkrishna5195
    @bharatkrishna5195Ай бұрын

    Namaskaram

  • @contactsrinivas4902
    @contactsrinivas4902Ай бұрын

    భావము :- గోవిందునకు మంగళము. గరుడకేతనునకు జయమంగళము, సర్వమునకు ఆత్మయైనవానికి శుభమంగళము. ధర్మమే స్వరూపముగా గలవానికి నిత్య మంగళము. . మూలమునకు మూలమైన దేవునకు, చ్యుతిలేనివానికి, పద్మనాభునకు, _ తొలికూర్మమై లోకమునకెల్ల ఆధారమైన మూర్తి గలవానికి, వేదమును కాపాడువానికి, ఎల్లవేళల వేదమార్గముననే విహరించువానికి, సామవేదమునుండి జనించిన గానము నందు ప్రీతిగలవానికి సదా మంగళము. శ్రీహరికి, పరమేశ్వరునకు, లక్ష్మీధరునకు, కాలాతీతునకు, (శ్రేష్టుడైన పురుషోత్తమునకు,బంధములకెల్ల దూరమైనవానికి, దేవతలు, మునులు గావించు స్తోతములు గలవానికి, దేవాసుర సమూహములో శ్రేష్టుడైనవానికి, దయకు నిలయమైన వానికి, పార్వతి వినుతించు మంగళకరమైన నామములు గలవానికి పరమ మంగళము... (బ్రహ్మకు వరము లిచ్చినవానికి సంసారమాలిన్యమును కడిగివేయువానికి, భవునకు, శంకరునకు, వ్యక్తముగానివానికి, అచ్చెరువుగొల్పు రూపము గలవానికి, విశ్వాకారునకు, ఈశ్వరునకు, లక్ష్మీదేవియొక్క కుచకుంభములమీ లపమునం దాసక్తుడైనవానికి, శ్రీవేంకటా(ద్రీశ్వరునకు మహా మంగళము, కడలేని జగములు - గల్పించే బ్రహ్మదేవు డడరి యే దేవు నాభి - యందుయుట్టెను.! పార్వతీదేవి 'సదా శ్రీహరి నామములను స్తుతించుచుండుననుట పురాణ ప్రసిద్ధము. శివునకు సామాన్యనామములైన 'భవునకు, శంకరునకు' అను విశేషణముల నిచట ఉపయోగించుటచే శివునితో కేశవున కభేదము సూచింప బడినది. “శ్రీధరునకు,పంకజా కుచకుంభ కుంకుమ పంకలోలునకు" అను విశేషణములచే నిత్యానపాయినియైన కమలాదేవితో గూడిన భగవంతుని రూపు క్తీర్తింపబడినది. ఇందుచే దేవునితోపాటు దేవికివి మంగళము

  • @dhanalakshmimankala7848
    @dhanalakshmimankala7848Ай бұрын

    Mine sir

  • @nallavellisrilakshmi
    @nallavellisrilakshmiАй бұрын

    Good evening sir. Annamacharya keerthana : Anganaleere Hara thullu learning video petra . Waiting to learn from you

  • @contactsrinivas4902
    @contactsrinivas4902Ай бұрын

    అయ్యా శివకేశవులు ఓకటికాదు అన్నమాచార్యులనోట హరి స్తుతియే తప్ప హరుడుని కోనియాడలేదు . అన్నమాచార్యులవారిది శ్రీ రామానుజాచార్య సంప్రదాయము వారి సంప్రదాయములో శివకేశవులు వేఱు అక్కడ శంకరునుకు అంటే మంగళమును ఇచ్చువాడు విష్ణు సహాస్రనామములో ఈ నామాలన్ని ఉంటాయి . అన్నమాచార్యులవారి సంకీర్తనా ప్రచారములో మీ నాన్న గారిది ఇప్పుడు మీ కృషి చాలా చాలా చాలా గోప్ప ప్రశంసనీయమైన విషయం , మీకుంటుంబానికి అనేక మంగళములు ఆ గోవిందుడు ఇచ్చుగాక స్వామి

  • @sailupanguluri

    @sailupanguluri

    Ай бұрын

    @contactsrinivas4902 శ్రీనివాస్ గారు నమస్తే అండి. చాలా బావుంది మీరందించిన భావము కూడ. కానీ, అన్నమయ్య రామానుజ సాంప్రదాయులు అయినప్పటికీ ఆయన్ని మించిన అద్వైతులు కూడా లేరు అనిపిస్తుంది. అందరిలో చివరికి ఒక్క వేంకటేశ్వర స్వామి వారే కదా కనిపించారు! శివుణ్ణి ప్రత్యేకించి నుతించకపోవచ్చు కానీ శివకేశవులకి అభేదం చూసిన వారిలా మాత్రం నేను స్వీకరించలేనండి అన్నమయ్యని. అలా ఎవ్వరు అన్నమయ్యను దర్శించినా చూస్తూ వుండలేక నా ఈ msg అండి. ఇదే కీర్తన రెండవ చరణంలో కాలాంతకుడైన శివునిగా హరిని దర్శించారు.శివుణ్ణి హరిగా, హరిలో దర్శించారు. బ్రహ్మమొక్కటే అని ఎలుగెత్తి పాడిన ఆయన శివ కేశవులలో భేదం చూశారంటే ఒప్పుకోలేను.ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన కీర్తనలో, "తలతురు మిము శైవులు, తగిన భక్తులునూ శివుడనుచు అలరి పొగడుదురు కాపాలికులు, ఆది భైరవుడనుచు" అని ఎలా వ్రాయగలరు? శివునిగా, ఆది భైరవునిగా కుడా నిన్ను కొలుస్తారు అని ఒప్పుకుని అనలేరు భేదం ఉంటే. పార్వతీనుతుడు అని హరిని ఆనలేరు. With all due respects I differ with u in this below point “ శివకేశవులు వేరు అన్నమాచార్యులవారికి". పెద్దవారు తప్పుగా భావించవద్దని మనవి🙏🙏 మీ వీలు కుదిరినప్పుడు ఈ క్రింది కీర్తనలు వినగలరు. శివునిగా హరిని దర్శించిన అన్నమాచార్యుల వారి కీర్తనలు. kzread.info/dash/bejne/Y56tqaOPcq2eis4.htmlfeature=shared kzread.info/dash/bejne/fXWFlbiqXcudZNo.htmlfeature=shared

  • @contactsrinivas4902

    @contactsrinivas4902

    Ай бұрын

    @@sailupanguluri నారాయణాద్రుద్రోజాయతే అను విషయమును తేలుపుటకే, నారాయణసూక్తం ….శివమచ్యుతం “న ద్వితియోఽస్తి కశ్చిత్” ఇలాగే ఉపనిషత్తులలో నారయణుడే అన్నిటిలో ఉన్నాడని తేలుస్తుంది అలాగే అన్నమాచార్యులవారు హరి అవతారములే అఖిల దేవతలు అని అనుగ్రహించారు అలాగ హరి నుండి వచ్చినవారు హరితో సమానమని అనుట స్వవచన వ్యాగాదము అది సంకీర్తనాచార్యులు చేయ్యరు . ఆపై భావనా స్వాతంత్ర్యం సేవచ్చను ఉపయోగించి ఏమైనా అనుకోవచ్చు వ్యక్తిగతముగా కాని హరి భక్తిని కలిగిన అన్నమాచార్యులవారు నేను అందమైన రామానుజాచార్య సంప్రదాయ పరుడను అని తేలియజేసిన అన్నమాచార్యులవారి కీర్తనలమీద లేని భావమును ఉంచరాదు అందుకనే బాధతో తేలియజేసాను. అనిల్ గారు మీ కీర్తనా సామర్థ్యం ప్రశంసనీయము ఏనో వేల స్వామి అన్నమాచార్యులవారి కీర్తనలను పాడి ఉంటారు ఇప్పటికే . ఇతడోక్కడే సర్వేశ్వరుడని అని నోకి నోకి అనుగ్రహించిన హరి వైభవమును పక్షపాతము లేకుండా వారు అందించిన తీరును గమనించండి ఓకచోట ఒకలాగా మరోకచోట తద్విరుద్ధమైన రీతిలో సంకీర్తనాచార్యులు అనరు కదా అలా అయితే అది లౌకిక కవిత్వంమేగాని గోవిందుడి మదిని దోచే కవిత్వంము కాదుకదా ఏదన్నా విరుద్ధమైన భావముతో కనిపించిన ఉంటే అది కలిపితమే అవును తప్ప కడురమనీయముకాదుకదా , లేదా తేలియని దశ తేలుసుకొన్న దశ అవుదును కాని స్వామి విషయంలో రెండవది అవటానికి ఆస్కారములేదు . ఇంత మంచిగా పాడిన మీకు మంగళము . పోరపాట్లు అందరము చేస్తాము అయితే సత్యం తేలిసినాక దిద్దుకోవటం మన కర్తవ్యం ధర్మం ఇక్కడ నేను సామాన్య అన్నమాచార్యులవారి భక్తుడని ఆ వెంకటాచలపతి నాతో చెప్పించారని నమ్ముతున్నాను . సత్యాన్ని నిలబెట్టండి స్వామి అంతే

  • @contactsrinivas4902

    @contactsrinivas4902

    Ай бұрын

    @@sailupanguluri విష్ణుండొక్కడే - విశ్వాత్మకుండు వైష్ణవమే స- ర్యంబును. ॥పల్లవి॥ పరమేస్టి సేయు - బ్రహ్మాండసృష్టియు హరునిలోని సం - హారశక్తి పరగగ నింద్రుని - పరిపాలనమును అరసి చూడ శ్రీ - హరి మహిమ.

  • @contactsrinivas4902

    @contactsrinivas4902

    Ай бұрын

    @@sailupanguluri అతండు. లక్ష్మీకాంతు. - డన్నియు నొసంగంగా inka enta matramuna ane variki vari budhi ante matrame unnadi chiviraki neeve paratatvamu adi evaroo kadu అతండు. లక్ష్మీకాంతు. - డన్నియు నొసంగంగా

  • @maruthimacha1847

    @maruthimacha1847

    Ай бұрын

    annamyya gurinchi cheppu, shivakeshavulu okati kadhu ani kadhu

  • @dhupati.krishnakumari.6913
    @dhupati.krishnakumari.6913Ай бұрын

    🙏 sir, I want to your annamayya sankeerthana learning classes to join. Please tell me how to join your classes

  • @sailupanguluri

    @sailupanguluri

    Ай бұрын

    @dhupati.krishnakumari.6913 Krishnakumari garu, every saturday 8am IST #Learnwithme live happens in this channel andi. You don’t need to do anything. Just subscribe to the channel and a day before the live link will be posted. You can join by clicking that link. So, for Saturday morning session link will be posted on friday andi. Hope it helps

  • @gourivasavi7890

    @gourivasavi7890

    Ай бұрын

    kzread.infok1x-9fwAsf8?si=Hk91dK4UjXqCefTI కృష్ణకుమారి గారు This is the link of learn with me -latest session

  • @dhupati.krishnakumari.6913

    @dhupati.krishnakumari.6913

    29 күн бұрын

    Thank you for your reply, Thank you very much

  • @ranisvantillu7777
    @ranisvantillu7777Ай бұрын

    Ayyo nee chanell innirjulu naku enduku theluvaledo

  • @dhanalakshmimankala7848
    @dhanalakshmimankala7848Ай бұрын

    Hello sir

  • @drsurumanmadharao2991
    @drsurumanmadharao2991Ай бұрын

    🙏

  • @swarali1129
    @swarali1129Ай бұрын

    🙏🙏🙏

  • @subramaniamramesh6360
    @subramaniamramesh6360Ай бұрын

    Namaskaram

Келесі