హారున్ బజాజ్ వారి ఎలక్ట్రిక్ ఆటో ఆవిష్కరణ 👉News Knl

హారున్ బజాజ్ వారి ఎలక్ట్రిక్ ఆటో ఆవిష్కరణ
ముఖ్య అతిథిగా హాజరైన బజాజ్ ఆటో లిమిటెడ్ ఐబియూ రీజినల్ మేనేజర్ కేశవమూర్తి rto శ్రీధర్
టెక్నాలజీ కొత్తది.. భరోసా అదే"..అన్న నినాదం తో బజాజ్ సరికొత్త ఆటో వర్క్ షాప్ ఎలక్ట్రిక్ 3 వీలర్లను హారూన్ బజాజ్ అందుబాటులోకి తీసు కొచ్చినట్లు బజాజ్ ఆటో లిమిటెడ్ ఐబియూ రీజినల్ మేనేజర్ కేశవమూర్తి పేర్కొన్నారు. మంగళవారం నగర శివారులోని సుంకేసుల రోడ్డులో గల ఎమ్మార్సి ఫంక్షన్ హాలులో ఆటో ఆవిష్కరణ కార్యక్రమo ఏర్పాటు చేశారు. ఈ కార్య క్రమానికి రీజినల్ మేనేజర్ సేల్స్ కార్తికేయన్, రీజినల్ మేనేజర్ సర్వీస్ చంద్ర శేఖర్ లతో పాటు ఇబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా జనరల్ మేనేజర్ తన్వీర్ మాట్లాడుతూ ఆటోనగర్ కస్టమర్లకు చేరువలో ఆధునిక హంగులతో సరికొత్త బజాజ్ -3 వీలర్ షోరూం,వర్క్ షాప్ ప్రారం భించడం హర్షించదగ్గ విషయ మన్నారు. ఆటో రంగంలో మొట్ట మొదటి సారిగా ఎలక్రిక్ ఆటోలని ఆవిష్కరించడం తమ కెంతో గర్వంగా ఉందన్నారు.
బజాజ్ వారి సరికొత్త ఆర్ ఇ-ఈ టెక్ 9.0, ఎక్సెల్ కార్గో ఇ-టెక్ 12.0ఎలక్ట్రిక్ ఆటోలు కర్నూలు నగరంలో ఆవిష్కరించారు. ఇందులో ఐపీ-67 రేటెడ్ అడ్వా న్స్ లై అయాన్ బ్యాటరీ, టూ స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, అత్యంత సమర్థ వంత మైన పర్మినెంట్ మ్యాగ్నెట్ సిక్రోనస్ మోటార్లు పొందుపరిచారని వివరించారు. ఈ వాహనాల్లో కే డబ్ల్యు హెచ్ బ్యాటరీ 178 కీ.మీ., 183 కీ మీ. రేంజ్ మైలేజ్ అరాయ్ సర్టిఫికేషన్ ప్రకారం ఇస్తుం దన్నారు. ఎక్స్ షోరూం ధర రూ.3,65,419 నుండి రూ.5 లక్షల లోపు నిర్ణయించడం జరిగిందని స్పష్టం చేశారు. కొనుగోలు దారులకు అతిధుల చేతులు మీదుగా వాహనాలను పంపిణీ చేశారు.

Пікірлер: 1

  • @gangadharnerla2919
    @gangadharnerla291919 күн бұрын

    Sir market ledu kakinadalo

Келесі