బాల సంతులకు బౌద్ధానికి ఏమైనా సంబంధం ఉందా? బిక్షాటన చేస్తూ దీవించడం ఎవరి లక్షణం! Ambedkar Vision TV

🔔'బాలసంత'
అశోక విజయదశమి రోజు (అక్టోబర్ 05,2022)పొద్దున 4 గంటలకు చీకట్లో జంగయ్య మా ఊరికి, మా ఇంటికి వచ్చిన సందర్భంగా తీసిన వీడియో ఇది.
ఎందుకు వచ్చావు అంటే - " దీవించడానికి వచ్చాను" అని అన్నాడు.
ఒక భిక్షగాడు,యాచకుడు 'ప్రజలను దీవించడం " ఏమిటి?
ఇతనికి ఇంత పవర్ ఎక్కడిది?
బ్రాహ్మణుడే గదా భారత దేశంలో దీవించే అర్హత ఉన్నది!
ఇలాంటి ధార్మిక పవర్ భిక్షగానికి ఉంటే దాని మూలం,చరిత్ర ఏమిటి?
బాలసంత కు...శైవానికి ఏమైనా సంభంధం ఉందా!?
బాలసంత కు...అశోక విజయదశమి కి ఏమైనా సంభంధం ఉన్నదా?
బాలసంత కు... యాచక వృత్తి ధర్మానికి-మొత్తంగా ఇన్ని యాచకులు ఉండడానికి - యాచక కళలకు,గంట కు, భిక్షకు - భిక్షగానికి - భిక్షమయ్యల పేర్లకు-బౌద్ద భిక్షువులకు, సంచారానికి - బౌద్ద ధర్మానికి ఏమైనా సంభంధం ఉందా?
దీనిపై సాహిత్య - సాంస్కృతిక - సామాజిక - చారిత్రక పరిశోధకులు అధ్యయనం చేసి,విశ్లేషణ చేసి మనకు అందించాల్సిన చరిత్ర క అవసరం ఎంతో ఉన్నదనిపిస్తుంది.
ఇది వర్తమానంలో నేడు మనం చేయాల్సిన కర్తవ్యాన్ని నిర్ధేస్తుందని, దీనితో భవిష్యత్ నిర్మాణానికి మార్గాన్ని సుగమం చేస్తుందేమో ననిపిస్తుంది.
👉భారత దేశ సంస్కృతిని అర్ధం చేసుకోకపోతే ఒక్క అడుగు ముందుకు పోలేమోనని అనిపిస్తుంది.
సామాజిక పురోభివృద్ధిని కోరుకునే వారందరూ ఆలోచించాల్సిన విషయంగా నేను భావిస్తున్నాను.
#ambedkarsong #drbrambedkar #ambedkar #ambedkarism #ambedkarvisiontv #balasantulu #buddha #buddhism #buddhist

Пікірлер: 1

  • @ybalarajuybalaraju3914
    @ybalarajuybalaraju391410 ай бұрын

    jai bhee

Келесі